ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ పోస్ట్ చూసినా పూనమ్ పాండే (poonam pandey) గురించి ఉంటుంది.ఈ భామ నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంది.
మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సర్వైకల్ క్యాన్సర్ (cervical cancer ) బారిన పడి తాను చనిపోయినట్టు డ్రామా ఆడి తీవ్ర దుమారం లేపింది పూనమ్ పాండే. ఆ తర్వాత మరుసటి రోజు నేను బ్రతికే ఉన్నానంటూ ఓ వీడియో షేర్ చేసి అందరిని షాక్ కు గురి చేసింది.
ప్రాణాంతకమైన సర్వైకల్ కాన్సర్ పైన మహిళలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశానని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చింది పూనమ్ పాండే. ఈమధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్ బారినపడి చాలామంది మహిళలు అవగాహన లేక చనిపోతున్నారని తెలిపింది.
తన చావు కబురుతో అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నారని ఈ రకంగా వారిలో అవగాహన పెరిగిందని తెలిపింది. అయితే పూనమ్ తీరుతో చాలామంది మండిపడుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది పూనమ్ చేసింది కరెక్ట్ అని ఆమెను సపోర్ట్ చేస్తున్న. తాజాగా టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma) కూడా పూనమ్ పాండే ఫేక్ న్యూస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
No one can question you : నిన్నెవరూ ప్రశ్నించలేరు
తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma)..”హేయ్ పూనమ్(poonam pandey) పాండే సర్వైకల్ క్యాన్సర్(cervical cancer) గురించి అవగాహన కల్పించడానికి నువ్వు ఎంచుకున్న పద్ధతి అందరికీ అర్థం కాక నచ్చకపోవచ్చు. కానీ ఎవరు కూడా నువ్వు చేసిన పనిని, నీ ఉద్దేశాన్ని ప్రశ్నించలేరు. ఈ యొక్క ఫేక్ వీడియోతో ప్రస్తుతం దేశం అంతా సర్వేకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటుంది.
నువ్వు ఎన్నో ఏళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు. పూనమ్ చేసిన ఈ సాహసంపై ప్రశంసలు కురిపించారు. దీనితో ప్రస్తుతం పూనమ్ పాండే వీడియోతో పాటు రాంగోపాల్ వర్మ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది.
Police case on Poonam : పూనమ్ పై పోలీసు కేసు
ప్రాణాంతకమైన సర్వైకల్ క్యాన్సర్ (cervical cancer) గురించి అవగాహనా కలిపించడానికే పూనమ్ (poonam )చేసిన పనికి చాలామంది మద్దతుగా నిలుస్తుంటే కొంతమంది మాత్రం ఆమెని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె వ్యవహారంపై మండిపడుతున్నారు.
అంతేకాదు తాజాగా పూనమ్ పై పోలీస్ కేసు నమోదు అయింది. ముంబై (mumbai )లో ఓ జర్నలిస్ట్ పూనమ్ పాండేపై కంప్లైంట్ ఇచ్చాడు. పూనమ్ పాండే తన చావుపై తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను అరికట్టాలని తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేనినట్లు తెలుస్తోంది.