What is Prana Pratishtha & its importance: ఎంతో మంది రామభక్తులు ఎన్నో దశాబ్దాల నుండి కంటున్న కల జనవరి 22వ తేదీతో సాకారం కానుంది. 2024 జనవరి 22వ తేదీని చరిత్ర లో లిఖించదగ్గ విధంగా రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్(Rama Teerdha Kshetra Trust) రామమందిర నిర్మాణాన్ని చేపట్టింది.
శ్రీరామ చంద్రుని జన్మస్థలం అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. రఘునందనుడి మందిర ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్టే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఇక రామ మందిరంలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ప్రత్యేకంగా ఒక ముహుర్తాన్ని కూడా నిర్ణయించారు. అయితే ఈ ముహుర్తాన్ని ఎలా నిర్ణయిస్తారు ? ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటి ? సనాతన ధర్మం లో ప్రాణ ప్రతిష్టకు అంతటి ప్రాముఖ్యత ఎందుకు ఉంది అని చాల మందిలో సందేహాలు ఉన్నాయి.
సరిగ్గా ఆ 84 సెకన్లే కీలకం : Exactly those 84 seconds are crucial
ముందుగా రామ మందిరం లో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కి నిర్ణయించిన ముహూర్తం ఎప్పుడు ఆ సమయం ఏంటి అనేది చూద్దాం. జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు ఈ ముహూర్తం మొదలవుతుంది, ఆ ముహూర్తం లోనే రామ్ లల్లా(Ram Lalla) విగ్రహ ప్రతిష్టాపన మొదలు పెడతారు, ఆ కార్యక్రమాన్ని 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు కొనసాగిస్తారు.
కేవలం 84 సెకన్ల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పండితులు వేద మంత్రాలను ఉచ్చరిస్తున్న సమయంలో నిర్వహిస్తారు. ఇక ప్రాణ ప్రతిష్ట అంటే ఆలయంలో ప్రతిష్టించే విగ్రహం లోనికి ప్రాణ శక్తిని స్థాపించడం అని అర్ధం.
ఎప్పుడైతే ఈ ప్రాణ ప్రతిష్ట జరుగుతుందో అప్పుడు ఆ విగ్రహం లోనికి దైవం వచ్చి చేరుతుందని వేదాలు చెబుతున్నాయి. ప్రాణ ప్రతిష్ట చేయకపోతే దానిని కేవలం ఒక విగ్రహం మాత్రమే అని అంటారు.
పునర్నిర్మాణానికి కూడా ప్రాణప్రతిష్ట అవసరమా ?
కేవలం కొత్తగా ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు మాత్రమే కాదు, పాత ఆలయాలు శిథిలావస్థకు చేరినప్పుడు వాటిని పునర్నిర్మించి మరో సారి విగ్రహ స్థాపన చేస్తారు. అలా చేసినప్పుడు కూడా ప్రాణ ప్రతిష్ట అనే ప్రక్రియ తప్పనిసరిగా ఉంది తీరుతుంది.
దానికి వేద పండితులు ఒక సుముహూర్తాన్ని నిర్ణయించి శాస్త్రోక్తంగా ఈ ప్రకియను పూర్తిచేస్తారు. ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహానికి పూజలు చేయరు, ఒకసారి ప్రాణ ప్రతిష్ట గనుక పూర్తయితే తప్పకుండా పూజ పునస్కారాలు, చేయడం, నైవేద్యాలు నివేదించడం అనేవి తప్పనిసరిగా ఉంటాయి.
ప్రాణ ప్రతిష్ట పూర్తయితే ఆ విగ్రహాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు.
ముందుగా విగ్రహానికి దేంతో అభిషేకం చేస్తారు ?
ఈ ప్రాణ ప్రతిష్ట చేసే ముందు ఆలయాన్ని పరిశుద్ధమైన నీటితో శుభ్రం చేస్తారు. అలాగే ఆలయంలో ప్రతిష్టించే విగ్రహానికి పరమ పవిత్రమైన గంగా(Ganga) జలం తో అభిషేకం చేస్తారు.
వివిధ రకాల పుష్పాలతో అలంకారం చేయడం సుగంధ భరితమైన పూలతో అర్చన చేయడం ఉంటుంది. అలాగే ఆవు పాలు, పలురకాల ఫలాలు స్వామీ అభిషేకానికి వాడబడతాయి.
ఎన్ని గ్రహాలూ ఏనుకూలంగా ఉన్నాయంటే..
మనదేశంలో ఎక్కడ ఆలయాన్ని నిర్మించినా నూటికి 99శాతం ఇలాంటి పద్ధతులనే అవలంబిస్తారని తెలుస్తోంది. కాబట్టి అయోధ్య రామమందిర Ayodhya Ramamandir నిర్మాణ అనంతరం గర్భగుడిలో ప్రతిష్టించబోయే విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కూడా సుముహూర్తాన్నే ఎంపిక చేశారు. ద్వాదశ తిథిలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం చాల మంచిదని అంటున్నారు పండితులు.
ఆ ముహూర్తం విష్ణువుతో ముడిపడి ఉంటుందట, కాబట్టి ఆ ముహూర్తంలో ఆలయ ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ఆలయంలో శ్రీమహా విష్ణువు(Maha Vishnu) ఉనికి కూడా ఉంటుందని వేదాన్ని అవపోసన పట్టిన పండితులు చెబుతున్నారు.
సాధారణంగా విగ్రహ ప్రతిష్టకు ఐడి గ్రహాలు అనుకూలంగా ఉంటె దానిని మంచి సుముహుర్తంగా భావిస్తారట, కానీ రామ్ లల్లా(Ram Lallaa) విగ్రహ ప్రతిష్టకు ఆరు గ్రహాలూ అనుకూలంగా ఉన్నాయట, అంటే ఇది ఇంకా దివ్యమైన ముహూర్తంగా పరిగణించవచ్చని ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని వారణాసికి(Varanasi) చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్(Ganeswar Sastri Dravid) చెప్పినట్టు తెలుస్తోంది.