Ram Mandir Video Goes Viral : సర్వాంగసుందరంగా అయోధ్య రామ మందిరం.

website 6tvnews template 58 Ram Mandir Video Goes Viral : సర్వాంగసుందరంగా అయోధ్య రామ మందిరం.

Ram Mandir Video Goes Viral: అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది, కేవలం కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈ ఆలయం కోసం కొన్ని కోట్ల గుండెలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.

కేవలం భారత దేశం(India) వారు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల వారు కూడా ఈ ఆలయంలో రఘునందనుడి ప్రాణ ప్రతిష్ట సుమూర్తం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అత్యంత వైభవంగా నిర్మించిన రామ మందిరాన్ని(Ayodhya Rama Mandir) అంతకన్నా సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.

రకరకాల పూలను తెచ్చి రామ మందిర అలంకరణకు ఉపయోగించారు. అలాగే మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా అలంకరించడంతో రామ మందిరం మరింత శోభాయమానంగా మెరిసిపోతోంది.

(Ram Mandir Decorated) ఈ అలంకారాలతో ఉన్న మందిరాన్ని ఫోటోలు వీడియోలు తీసిన వారు సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు మరింత వైరల్ గా మారాయి.

అన్ని ఏర్పాట్లు పూర్తి : All Arrangements Are All Most Completed

రామ జన్మ భూమి లో రామ మందిర నిర్మాణం జరగడం అనేది ఎన్నో శతాబ్దాల నాటి కల. ఈ రామాలయాన్ని మనం ఉన్న కాలంలో నిర్మించడం, దానిని మన కళ్ళతో మనం చూడగలగడం మన అదృష్టంగాభావించవచ్చని చాలామంది అంటున్నారు.

ఈ మందిరంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి వేదాన్ని అవపోసన పట్టిన పండితులచే సుముహూర్తాన్ని నిర్ణయించారు. అలాగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా నిర్వహిస్తారని, ఆయనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉంటారని తెలుస్తోంది.

ఇప్పటికే అనేక రాష్ట్రాల నుండి రామ భక్తులు అయోధ్యకు చేరుకొని జనవరి 22వ తేదీన జరగబోయే ఆ మహత్కార్యాన్ని తిలకించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. (Ram Mandir Decorated)పైగా ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు అనేకమంది హాజరు కానున్నారు.

అందుకే ఇప్పటినుండే రామ మందిరాన్ని ఇలా అలంకరించి సిద్ధం చేస్తున్నారు. ఇక లక్షల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో భద్రతా పరమైన ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు, అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.

మరోవైపు ఈ కార్యక్రమాన్ని 22వ తేదీన టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాయి.

Leave a Comment