Breaking News

Ramcharan host Diwali celebrations at house: రాంచరణ్ ఇంట దీపావళి సంబరాలు.గెస్టులుగా వచ్చిన తారాతోరణం.హోస్టింగ్ అదిరింది అంటున్న నమ్రత.

Add a heading 1 Ramcharan host Diwali celebrations at house: రాంచరణ్ ఇంట దీపావళి సంబరాలు.గెస్టులుగా వచ్చిన తారాతోరణం.హోస్టింగ్ అదిరింది అంటున్న నమ్రత.

Ramcharan host Diwali celebrations at house: రాంచరణ్ ఇంట దీపావళి సంబరాలు.గెస్టులుగా వచ్చిన తారాతోరణం.హోస్టింగ్ అదిరింది అంటున్న నమ్రత.

టాలీవుడ్ లో ఏ ఇద్దరు హీరోలు కలిసి ఫోటో దిగినా, భవిష్యత్తులో వారిద్దరూ కలిసి మల్టి స్టారర్ సినిమా చేయబోతున్నారు అంటూ పుకారేషు షికార్లు చేస్తాయి. కానీ ఈ సారి ఏకంగా నలుగురు స్టార్ హీరోలు కలిసి ఫోటో కి ఫోజివ్వడంతో ఇప్పడు అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఇది మాత్రం మల్టి స్టారర్ కోసం కాదండోయ్. ఇది పక్కా కాజువల్ ఫోటో. దీనిని ఎక్కడ ఎవరు ఎందుకు తీశారు అని వివరాల్లోకి వెళదాం.

ఈ ఫొటోలో కనిపించిన మహేష్ బాబు, jr.ఎన్టీఆర్, రాంచరణ్, విక్టరీ వేంకటేష్ లు ఓ పార్టీలో కలిశారు. ఈ పార్టీని రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆరెంజ్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ పార్టీని వారు హోస్ట్ చేశారు. ఇక jr.ఎన్టీఆర్, మహేష్ బాబు సతీసమేతంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఉపాసన, నమ్రత, లక్ష్మి ప్రణతిలు సరదాగా గడుపుతున్న సమయంలో రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఫోటోలు తీశాడట. కార్తికేయ తీసిన ఆ ఫోటోలు నమ్రతకు తెగ నచ్చేశాయట. వీరు ఆ పార్టీని తెగ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.

సాధారణంగా స్టార్ హీరోలు ఎవరింట్లో వారే పండుగలు నిర్వహించుకుంటారు. కానీ టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఇలా పండుగలకు ఎవరో ఒకరు హోస్ట్ చేయడం కనిపిస్తోంది. మిగిలిన వారందరు హోస్ట్ చేసిన ప్లేస్ కి విచ్చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇది బాలీవుడ్ లో ఎప్పటి నుండో ఉంది. బాలీవుడ్ సెలెబ్రెటీస్ ముఖ్యంగా దసరాకి, దీపావళికి, క్రిస్మస్ కి లేదంటే న్యూ ఇయర్ పార్టీకి ఇలా ఒకే చోట కలుస్తూ ఉంటారు. దీనిని మన తెలుగు వారు మెల్లగా అందిపుచ్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ఈ దీవాలి పండుగను బాగా ఎంజాయ్ చేశామని, రామ్ చరణ్, ఉపాసనలు బాగా హోస్ట్ చేశారని, చెప్పుకొచ్చారు నమ్రత. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ఈ పార్టీలో మెగా, దగ్గుపాటి, నందమూరి ఫ్యామిలీలు ఉన్నాయి కానీ అల్లు వారి ఫ్యామిలీ కనిపించలేదు. అల్లు శిరీష్ కానీ, అల్లు అర్జున్ కానీ వచ్చినట్టుగా జాడ లేదు. ఏది ఏమైనా వెంకీ, మహేష్, రాంచరణ్, తారక్ కలిసి ఉన్న ఫోటో చూసి ఫాన్స్ మురిసి పోతున్నారు. వీరంతా కలిసి ఒక ఫొటోలో కాకుండా ఒకే సినిమాలో ఉంటె ఎంత బాగుంటుందో అని ఆశపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *