బుచ్చిబాబు..బుల్లోడు, బుల్లెమ్మ రెడీ

WhatsApp Image 2024 03 20 at 5.24.12 PM బుచ్చిబాబు..బుల్లోడు, బుల్లెమ్మ రెడీ

Ramcharan RC 16 movie pooja ceremony at hyderabad : మొదటి సినిమాతోనే హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు సన (Buchhi Babu Sana). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన బుచ్చిబాబు ఉప్పెన (Uppena)మూవీతో దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయమయ్యాడు. మెగా వారి బుల్లోడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జోడీగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. ఈ ఒక్క సినిమాతోనే బుచ్చిబాబుకు స్టార్ ఇమేజ్ వచ్చింది. అంతే కాదు రెండో సినిమా కూడా మెగా హీరోతోనే చేస్తుండటం విశేషం. పవర్ స్టార్ రామ్ చరణ్ (RamCharan)‏తో చేసే ఛాన్స్ కొట్టేశాడు ఈ యువ దర్శకుడు.

ఆర్సీ 16 (RC16) అనే వర్కింగ్ టైటిల్‏తో బుచ్చిబాబు (Buchhi Babu)రామ్ చరణ్ (Ramcharan)తో నయా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ , దివంగత నటి శ్రీదేవీ (Sridevi) పెద్ద కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్యనే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అంతే కాదు ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ (Oscar Award)విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rehman)మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ దిగ్గజ సెలబ్రిటీలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ శంకర్ (Shankar),సుకుమార్ (Sukumar), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అల్లు అరవింద్ (Allu Arvind), బోనీ కపూర్ (Boney Kapoor)తోపాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆర్సీ 16 (Rc16)హీరో రామ్ చరణ్ (Ramcharan)మాట్లాడారు..” ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్టులకు నా కృతజ్ఞతలు . బుచ్చిబాబు రాసిన స్టోరీ నాకు బాగా నచ్చింది. ఆడియన్స్ కు ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది. వారికి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ” అని చరణ్ తెలిపాడు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ప్రొడ్యూజ్ చేస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న శంకర్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer) షూటింగ్ పూర్తయ్యాకే రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి కలిసి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చేశారు. ఇప్పుడు చిరు కొడుకు. శ్రీదేవి పెద్ద కూతురు కలిసి సినిమా చేస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment