రామ్ పోతినేని – పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత హిట్టో తెలిసిందే . మళ్ళీ వీరి ఇద్దరి కాంబినేషన్లో “డబుల్ ఇస్మార్ట్” రూపొందుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా తొలి టీజర్ను నెల 15 రామ్ పుట్టినరోజున విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలియచేసారు. ఈ విషయాని తెలియచేసే పోస్టర్ ను సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. నల్లటి టోపీ, మాస్క్ , పులి చారల షర్ట్, జీన్స్ తో పక్క మాస్ లుక్ తో అదరగొట్టాడు.కళ్ళలో నిర్లక్ష్యం, రఫ్ లుక్, సీమ టపాకాయలను చేత్తో పట్టుకొని కూర్చన్న పోస్టర్ అదిరిపోయింది. మాస్ సినిమాలను
డబుల్ మాస్ మేకింగ్ తో అందించే పూరీ ఈ మధ్య లైగర్ దెబ్బకు డీలా పడ్డారు. రామ్ కూడా స్కంద వైఫల్యంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆర్ధికంగా దెబ్బతిన్న పూరికి, హిట్ లేక సతమత మవుతున్న రామ్ కి అర్జెంట్ గా ఓ పెద్ద హిట్అవసరం. అందుకే కొత్త కథ జోలికి పోకుండా గతంలో దుమ్ము లేపిన ఇస్మార్ట్ శంకర్ సీరీస్ కే ఫిక్స్ అయ్యారు ఇద్దరూ.. పక్కా మాస్ యాక్షన్ మసాలా
జానర్ నే పూరీ మళ్ళీ ఎంచుకొన్నాడు. టాలీవుడ్, బాలీవుడ్ తారాగణంతో భారీ బడ్జెట్ టో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు లేకపోయినా బాలీవుడ్ లో కొంత ఆసక్తి ఉంది. ఇప్పటికే “డబుల్ ఇస్మార్ట్” ముంబాయిలో శరవేగంతో షూటింగ్ జరుపు కుంటోంది. సంజయ్ దత్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఉత్తరాదిన కూడా కొంత క్రేజ్ ఉంది. అయితే “లైగర్” కథను నడిపిన తీరు ఉత్తరాది ప్రేక్షకులకూ నచ్చని నేపథ్యంలో అదే మాస్ మసాలా టైపు కథానాన్నే ఎంచుకున్న పూరీ రామ్ తో ఏమి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. పూరీ కనెక్ట్స్ బానర్ పై
నిర్మాతగా పూరీ ఛార్మీ లు వ్యవహరిస్తుండగా.. సంగీతాన్ని మణి శర్మ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి అందిస్తున్నారు.
పక్కా మాస్ యాక్షన్ మసాలా గా రానున్న డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.