
మాజీ ఎంపీ, బీజేపీ కీల నేత విజయశాంతి ఒక భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. తన రాజకీయ జీవితంపై రాములమ్మ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 25 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తానెప్పుడూ ఏ పదవీ కోరుకోలేదని, ఇప్పటికీ కూడా తాను అలా అనుకోకున్నా ఈ పరిస్థితే ఎదురవుతోందని చెప్పారు.
ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యమని అన్నారు, దశాబ్దాల ముందు తెలంగాణ కోసం పోరాటం చేసింది, తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసమే కానీ బీఆర్ఎస్‌కు వ్యతిరేకం అవుతామని కాదన్నారు.
ఇప్పుడు కూడా తన పోరాటం కేసీఆర్ కుటుంబ దోపిడీ మీద, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకపాలన మీదే తప్ప బీఆర్ఎస్ కార్యకర్తలపై కాదన్నారు. ఎందుకంటే ఇదే బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకప్పుడు తనతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం పెట్టి పనిచేశారని గుర్తుచేసుకున్నారు.
తాను ఎవరైనా రాజకీయంగా విభేదించానే తప్ప మరోవిధంగా కాదన్నారు. ఇతర పార్టీల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు రాసుకొచ్చారు విజయశాంతి.