Rana Daggubati in Jai Hanuman : హనుమాన్ (Hanuman) సినిమాతో తన సత్తా ఏంటో దేశవ్యాప్తంగా చూపించాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma).
డివోషనల్ కాన్సెప్టుతో మెస్మరైజింగ్ గ్రాఫికల్ వర్క్ తో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్. ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాడు.
ఇదే ఊపుతో హనుమాన్ సీక్వెల్ ను అనైన్స్ చేసి అందరిలో ఆసక్తిని పెంచాడు. త్వరలో జై హైనుమాన్ (Jai Hanuman) తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులను షురూ చేశాడు.
దీంతో హనుమాన్ సినిమా చివర్లో హనుమంతుడి క్యారెక్టర్ లో కనిపించింది ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు తెగ ట్రై చేస్తున్నారు. తాజాగా జై హనుమాన్ హీరో ఎవరో హింట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.
Rana as Hanuman : ఆంజనేయ స్వామి పాత్రలో రానా
హనుమాన్ (Hanuman)సీక్వల్ను అనౌన్స్ చేసినప్పటి నుంచి జై హనుమాన్ (Jai Hanuman)మూవీపై ఆసక్తి పెరిగింది. హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట కోసం ఏం చేశాడు అనేది జై హనుమాన్ లో చూపించబోతున్నట్లు హనుమాన్ మూవీలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హింట్ వదిలాడు.
ఇక ఈ సీక్వెల్ లో ఆంజనేయ స్వామి పాత్రలో సీనియర్ హీరో కనిపిస్తారని కూడా ప్రకటించాడు ప్రశాంత్. దీంతో ఆ స్టార్ హీరో ఎవరనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
ఒక్కొక్కరు ఒక్కో హీరోను గెస్ చేస్తున్నారు. ఎక్కువ మంది నెటిజన్స్ రానా ఆంజనేయ స్వామిగా కనిపిస్తారని అంచనా వేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే మరోవైపు సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందని తెలుసుకునేందుకు సినీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఈ క్రమంలో జై హనుమాన్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma).
ఇంటర్వ్యూలో రానా హనుమంతుడిగా కనిపిస్తారు అనే న్యూస్ లో ఎంత వాస్తవం ఉంది అని యాంకర్ అడిగారు. దీనికి సమాధానంగా రానా కచ్చితంగా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగమవుతారని చెప్పాడు. దీంతో జై హనుమాన్ లో ఆ రానా (Rana)నే హనుమంతుడంటూ కన్ఫామ్ చేసేస్తున్నారు.
అంతే కాదు హనుమాన్ క్లైమాక్స్ లో వచ్చిన యానిమేటెడ్ హనుమాన్ కళ్ళు అచ్చం రానాలాగే ఉన్నాయని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే జై హనుమాన్ లో ఖచ్చితంగా రానా ఆంజనేయ స్వామిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
Jai Hanuman Release in 2025 : 2025లో జై హనుమాన్ రిలీజ్
ఇదే ఇంటర్వ్యూలో జై హనుమాన్ (Jai Hanuman)గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు ప్రశాంత్ (Prashanth). “హనుమాన్‌కు సీక్వెల్‌గా వస్తున్న జై హనుమాన్ మూవీ స్క్రిప్ట్ సిద్ధమైంది.
అంతేకాదు, హనుమాన్ సినిమాతో పోల్చితే ఈ మూవీ వంద రెట్లు ఎఫెక్టివ్ గా ఉంటుంది. అయితే ఈ సీక్వెల్ లో హీరో తేజ సజ్జ (Tej Sajja) కాదు.
తేజ హనుమంతు క్యారెక్టర్ లో మాత్రమే కనిపిస్తాడు. జై హనుమాన్ లో అసలైన హీరో ఆంజనేయ స్వామి . ఆయన పాత్రలో స్టార్ హీరో కనిపిస్తారు.
ముందుగా చెప్పినట్లుగానే ఈ మూవీని 2025లోనే విడుదల చేస్తానని” అందరికీ షాక్ ఇచ్చాడు ప్రశాంత్.