Ranbir Kapoor on animal park : యానిమల్‌ పార్క్‌’ మరింత బోల్డ్‌గా ఉంటుంది..విమర్శలకు రణ్‌బీర్‌ రిప్లై

website 6tvnews template 2024 01 30T111128.267 Ranbir Kapoor on animal park : యానిమల్‌ పార్క్‌' మరింత బోల్డ్‌గా ఉంటుంది..విమర్శలకు రణ్‌బీర్‌ రిప్లై

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor),నేషనల్ క్రష్ రష్మిక (rashmika mandanna)లు జోడీగా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ( sandeep reddy vanga) తెరకెక్కించిన మూవీ ‘యానిమల్‌’. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించిన యానిమల్ మూవీ లేటెస్ట్ గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌‎లో స్ట్రీమ్‌ అవుతోంది. అయితే, ఓటీటీ లో ఈ మూవీని చూసిన ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

హింసాత్మక దృశ్యాలు సినిమాలో ఎక్కువగా ఉన్నాయని, ఒక హీరో అయ్యుండి ఇలా చేయకూడదు అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఓటీటీ వీక్షకుల మాత్రమే కాదు చాలామంది ఫిలిం మేకర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివిటీ బాగా స్ప్రెడ్ అవ్వడంతో హీరో రణ్‌బీర్‌ కపూర్‌ రంగంలోకి దిగాడు. తనదైన స్టైల్ లో విమర్శలకు రెస్పాన్స్ ఇచ్చాడు . అంతే కాదు యానిమల్ పార్క్ గురించిన లేటెస్ట్ అప్‎డేట్స్‎ను పంచుకున్నాడు.

Director Javed Akhtar sensational comments: డైరెక్టర్‌ జావెద్‌ అక్తర్‌ సంచలన కామెంట్స్‌

యానిమల్ (Animal)మావీ దేశవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. యూత్ ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డి (sandeep reddy vanga)దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాను మించి విజయాన్ని సాధించింది. అదే స్థాయిలో మూవీపై విమర్షలు కూడా వచ్చాయి. అసలు మనుషులు అనేవారు యానిమల్ చూస్తారా అని చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. సినిమా థియేటర్స్ నుంచి వెళ్లిపోయినా కూడా ఇంకా యానిమల్ పై విమర్షలు కొనసాగుతూనే ఉన్నాయి.

బాలీవుడ్ స్టార్ సీనియర్ రైటర్ , డైరెక్టర్ జావేద్ అక్తర్ (Javed Akhtar) కూడా యానిమల్ పై సంచలన కామెంట్స్‌ చేశారు. హీరో అంటే ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండాలని, భార్యను తన్నడం వంటివి చేసి చూపించొద్దని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి రచయితలు ఈ అంశాన్ని గమనించాలని ఆయన అన్నారు. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది సొసైటీ డిసైడ్‌ చేయదని, సినిమా దాన్ని రిఫ్లెక్ట్‌ చేస్తుందని తెలిపారు.ఈ కామెంట్స్ తో సినిమాపై మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.

Ranbir counter to director Javed Akhtar? : డైరెక్టర్‌ జావెద్‌ అక్తర్‌‎కు రణ్‎బీర్ కౌంటర్ ?

తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో యానిమల్(Animal) కి వస్తున్న నెగిటివిటీ గురించి తనదైన స్టైల్ లో రెస్పాన్స్ ఇచ్చాడు…” తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం కొడుకును చీకటిలోకి, హింసవైపు తీసుకెళ్లింది. ఈ విషయంపై వ్యతిరేకత వచ్చినప్పటికీ.. అందరూ సానుకూలంగానే మాట్లాడుకుంటున్నారు. విషపూరితమైన విషయం గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు అంటే.. ప్రజలను దానిని తప్పుగా ఫీల్ అవుతారు.

మూవీలో ఒక తప్పును తప్పు అని చూపిస్తేనే కదా.. ప్రజలు తెలుసుకునేది. అసలు తప్పులనే చూపించకపోతే ఎప్పటికీ అది తప్పు అని ఎవ్వరూ తెలుసుకోలేరు. సినిమాల్లో నటించే ఆర్టిస్టులు ఇచ్చిన క్యారెక్టర్లో లీనమైపోతాము. వాటిపై కచ్చితంగా సానుభూతి ఉంటుంది. ఏది తప్పు, ఏది కరెక్ట్ అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. నిజానికి ఓ తప్పుడు వ్యక్తిపై సినిమా తీయాలి . ఎందుకంటే అలాంటి వారిపై సినిమా తీయకపోతే సొసైటీ ఎప్పటికీ బాగుపడదు” అని రణ్‌బీర్‌కపూర్‌ సినిమాకు వస్తున్న నెగెటివిటీపై స్పందించాడు. ఒక రకంగా రణ్‌బీర్‌ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు..ఆ డైరెక్టర్ జావెద్‌ అక్తర్‌ (‎Javed Akhtar)కు కౌంటర్‌గానే అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Leave a Comment