రెండు రికార్డులు : Two Records set by indian team:
2024 ప్రారంభంలోనే క్రికెట్ భారత జట్టు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి రెండు నెలలైన కాకముందే భారత జట్టు రెండు అరుదైన రికార్డులు సాధించింది.
ఇటీవల సౌత్ ఆఫ్రికాతో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగితే దానిని అతి తక్కువ రోజులలో పూర్తి చేసింది.
కేవలం ఒకటిన్నర రోజుల వ్యవధిలో భారత్ గెలుపొంది ఆ మ్యాచ్ ముగించింది.
T20I Match:
తాజాగా టీ20 లోనూ అలాగే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
ఆఫ్ఘనిస్థాన్‌పై మూడవ టీ20లో రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు.
69 బంతుల్లో 121 పరుగులు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ రోహిత్ కడదాకా క్రీజులో ఉన్నాడు.
మ్యాచ్ టై :
ఈ 3 వ టీ20 మ్యాచ్ అత్యంతగా పొడవైన T20I మ్యాచ్ గా నిలిచింది. ఎందుకంటే మొదట మ్యాచ్ టై అయింది, ఇక ఈ కారణంగా సూపర్ ఓవర్ పెట్టడం జరిగింది, కానీ సూపర్ ఓవర్ కూడా మళ్ళీ టై అయింది, దాంతో రెండవ సూపర్ ఓవర్ పెట్టాల్సి వచ్చింది.
ఇక రెండో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలింది.