Rashmika Mandanna: మంచు లోయల్లో రష్మిక.. నెటిజన్స్ ట్రోలింగ్.
పుష్ప సినిమాతో రష్మిక మందన్నా లెవెలే మారిపోయింది. ఈ సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ కు యూత్ ఫిదా అయిపోయింది. తన అందం, నటనతో సౌత్ టు నార్త్ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారింది ఈ బ్యూటీ. దీంతో అమ్మడికి అవకాశాలు క్యూలు కడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది రష్మిక.
వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి కొట్టి సాధించింది.
ప్రస్తుతం భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. దీంతో రష్మిక ఫేమ్ మరింతగా పెరిగిపోయింది. బిజీ షూటింగ్లు, ప్రమోషన్లతో ఇన్నాళ్లు అలసిపోయిన రష్మిక ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయింది.
ఖాళీ సమయం దొరకడంతో తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసి అభిమానులను చిల్ చేసింది.
రష్మికకు సినీ ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఏ ఫోటో పెట్టినా, వీడియో షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది.
సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రష్మిక కాస్త కేటాయించుకుని మరీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది.
అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ల పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. తాజాగా యానిమల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ భామ ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
‘యానిమల్’ హిట్ ను ఎంజాయ్ చేసేందుకు మంచు ప్రదేశాన్ని ఎంచుకుంది రష్మిక. ఈ భామ ప్రస్తుతం మంచు లోయలలో హాయిగా విహరిస్తోంది.
ఈ వీడియోను తన ఫారోవర్స్ బాగా ఇష్టపడుతున్నారు. రష్మికను మంచులో ఆడుతుండటం చూసినవారంతో సో క్యూట్ అంటూ ఇన్‌బాక్స్‌లో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. లైకుల వర్షం కురిపిస్తున్నారు. చలికాలంలో ఇలాంటి మంచు ప్రదేశంలో విహరించడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఈ వీడియోతోపాటు రష్మిక నోట్ షేర్ చేసింది.
అయితే పాటలో కశ్మీర్ అని లిరిక్ వస్తున్నప్పటికీ నేను కశ్మీర్లో లేనని అలాంటి ప్రదేశంలో ఉండటం వల్ల ఆ పాటను ఉపయోగించి ఈ వీడియో తీశానని చెప్పుకొచ్చింది. ఈ మంచు ప్రదేశంలో రష్మిక చిన్నపిల్లలా మారిపోయి ఆడుకోవడం చూసి ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటోంది.
రష్మిక మందన్న మంచుతో కప్పిన లోయల్లో క్యూట్ పోజులు ఇస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. రష్మిక వీడియోని ఇప్పటికే లక్ష మందికి పైగా లైక్ చేసారు. ఇదిలా ఉంటే ఈ వీడియోలో రష్మిక మందన్న కూర్చున్న తీరును చూసి చాలా మంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
రష్మిక నేషనల్ క్రష్ కావడం మామూలు విషయం కాదు. నటనతో పాటు అమ్మడి చిన్నపిల్ల మనస్తత్వం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మధ్యనే డీప్ ఫేక్ వీడియోతో ఎంతో ఇబ్బంది పడింది రష్మిక.
ఈ క్రమంలో ఎంతో మంది స్టార్స్ ఈ బ్యూటీకి సపోర్ట్ గా నిలిచారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా బాలీవుడ్ బిగ్‌బీ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోరోడ్పతి షోలోనూ రష్మిక కనిపించి అందరిని అట్రాక్ట్ చేసింది.
ఈ షోలో పాల్గొన్నకంటెస్టెంట్ ప్రమోద్ తనకు రష్మిక అంటే ఇష్టమని, ఆమె నటించిన సినిమాలన్నీ చూశానని, అంతేకాదు రష్మికకు ప్రపోజ్ కూడా చేశానని తన మనసులోని మాటను అమితాబ్‌తో షేర్ చేసుకున్నాడు.
దీంతో వెంటనే అమితాబ్ రష్మికకు వీడియో కాల్ చేసి ప్రమోద్‌తో మాట్లాడించాడు. తన అభిమాన తార వీడియో కాల్ లో మాట్లాడటంతో ప్రమోద్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
మీరంటే ఎంతో అభిమానమని, వ్యక్తిగతంగా కలవాలనుందని అడగ్గా రష్మిక తప్పకుండా కలుద్దామని చెప్పింది. ఈ క్రమంలో అమితాబ్ రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు.