Rashmika Mandanna: నెట్టింట వైరల్ అవుతున్న రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో.
యనిమల్ సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తున్నసమయంలో రష్మిక మందన్నకి మరోసారి చేదు అనుభవం ఎదురయ్యింది.
మరోసారి ఆమె డీప్ ఫేక్ వీడియోని తయారు చేశారు. గతంలో ఒకసారి రష్మిక డీప్ ఫేక్ వీడియో సంఘటన తరువాత దేశం అంతా డీప్ ఫేక్ గురించి చర్చించింది.
లిఫ్ట్ లోకి వస్తున్న ఒక అమ్మాయి ముఖాన్ని మార్ఫింగ్ చేసి రష్మిక ముఖాన్ని పెట్టి వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియొ సోషల్ మీడియాలో పెద్ద దూమరాన్నే లేవనెత్తింది.
ఈ సారి కూడా అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఉపయోగించి ఆమె ఫేస్ ని మార్ఫింగ్ చేసి, అలాంటిదే మరో వీడియో తయారు చేశారు.
ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.అసలు రష్మిక మందన్నకే ఎందుకు ఇలా జరుగుతుంది? అంటూ ఆమె ఫాన్స్ మండిపడుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రష్మిక మందన్న, రణబీర్ కపూర్ కలిసి ఇటీవల నటించిన యనిమల్ సినిమా విడుదల అయ్యి రెండు వారాలే అయినప్పటికీ కలక్షన్ల పండగ జరుపుతోంది.
ఇక మూడవ వారంలో ఈ కలెక్షన్ల నెంబర్ మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఊహించని రీతిలో మిశ్రమ స్పందనలు ఎదుర్కున్నప్పటికి ఈ సినిమా కలెక్షన్ల పరంగా పెద్ద హిట్టే అని చెప్పవచ్చు.
ఇలాంటి సమయంలో రష్మికకి చేదు అనుభవం ఎదురయ్యింది. కానీ ఈ విషయం పట్ల రష్మిక గాని, ఆమె టీం కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.