Rashmika Mandanna: ఫోర్బ్స్ జాబితాలో రష్మిక..గర్వంగా ఉందన్న దేవరకొండ

be5c6a39 6e50 421f 9a76 18d9fad5fcc8 Rashmika Mandanna: ఫోర్బ్స్ జాబితాలో రష్మిక..గర్వంగా ఉందన్న దేవరకొండ

ఈమధ్యనే విడుదలైన యానిమల్ (animal )సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) . లేటెస్ట్ గా ఈ భామ మరో ఘనతను సాధించింది. ఫోర్బ్స్(frobes )ఇండియా 30 అండర్ 30 లిస్టులో ఈ భామ పేరు కూడా ఉండటంతో ఫాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.

ప్రతి ఏడది ఫోర్బ్స్ వివిధ రంగాల్లో ప్రతిభను చూపించిన ప్రముఖ వ్యక్తుల లిస్టును విడుదల చేస్తుంది. ఆ జాబితాలో రష్మిక చోటు సంపాదించుకుంది.దీంతో ప్రస్తుతం నెట్టింట్లో రష్మిక ట్రెండింగ్ లో ఉంది. ఈ కన్నడ బామకు స్టార్ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

Rashmika owns a rare honor : అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రష్మిక

గత ఏడాది రష్మిక (Rashmika Mandanna)కు బాగా కలిసి వచ్చింది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun )హీరోగా నటించిన పుష్ప (pushpa)సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక తాజాగా రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor )హీరోగా సందీప్ వంగ (sandeep vanga ) డైరెక్షన్లో వచ్చిన యానిమల్ సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన యానిమల్(Animal )మూవీ భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ సాధించింది. లవర్ బాయ్ రన్బీర్ ను కొత్తగా డైరెక్టర్ కొత్తగా, పవర్ఫుల్ గా చూపించడమే కాకుండా హీరోయిన్ రష్మికకు మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ ఇవ్వడంతో రష్మిక కాస్త గీతాంజలిగా అందరికీ దగ్గరైంది. ఆమె టాలెంట్ ని గుర్తించే ఫ్రోబ్స్ (Frobes )ఈ అరుదైన గౌరవాన్ని అందించినట్లు తెలుస్తోంది.

30 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న 30 మందిని ఈ జాబితాలో ఎంపిక చేస్తారు. ఈ ఏడాది సినిమా రంగం నుంచి ముగ్గురు తారను ఈ లిస్టులో చేర్చారు. రాధికా మదన్ ( Radhika Madan ) అదితి సైగల్ ( Adithi Saigal ) తో పాటు రష్మిక మందన్న లు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

I am proud of Rashmika says Vijay Devarakonda :రష్మికను చూస్తే గర్వంగా ఉందన్న విజయ్ దేవరకొండ

తనకు దక్కిన ఈ అరుదైన గుర్తింపుపై సోషల్ మీడియా వేదికగా నేషనల్ క్రష్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. మ్యాగజైన్ కవర్ ఫొటోను షేర్ చేసి తన ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్టును రష్మిక రూమర్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ (vijay devarakonda ) కూడా నెట్టింట్లో షేర్ చేశాడు. నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది రష్మిక అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆమెకు అభినందనలు తెలిపాడు. ఈ పోస్టు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రష్మిక, విజయ్ దేవరకొండలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా అవుతుందంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి . తమ మధ్య అలాంటిదేమీ లేదని ఇటీవలే రష్మిక, విజయ్ క్లారిటీ కూడా ఇచ్చారు. అయినా కూడా వీరిద్దరిపై నెట్టింట్లో ఏదో ఒక కథనం నిత్యం ప్రత్యక్షమవుతూనే ఉంటుంది.

Rashmika busy with crazy projects : వరుస ప్రాజెక్ట్స్ తో రష్మిక బిజీ

ఇటు సౌత్ లో నువ్వు అటు నార్త్ లోను రష్మిక మంచి జోరు మీద ఉంది. అనిమల్ సూపర్ హిట్ తో అమ్మడికి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. వరుసగా సినిమాలను చేస్తూ బామ బాగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ కన్నడ భామ పుష్పకు సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటే ‘రెయిన్‌బో’ (Rainbow ), ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ( The Girl Friend ), ‘చావా’ (Chawa)వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా మారింది.

Leave a Comment