Rashmika Mandanna: పార్టీ కావాలి..విజయ్ రిప్లై ఇదే

website 6tvnews template 2024 03 29T123244.692 Rashmika Mandanna: పార్టీ కావాలి..విజయ్ రిప్లై ఇదే

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఫ్యామిలీ మెన్ గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. సీతారామం (Sitharamam) ఫేమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)హీరోయిన్ గా పరుశురామ్ (parushuram)డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజయ్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ ఇది. ఇప్పటి వరకు రౌడీ బాయ్ గా కనిపించిన విజయ్ ఈ సినిమాలో కంప్లీట్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తున్నాడు.

ఫ్యామిలీ ఎమోషన్స్, బాధ్యతల మధ్య తన లవ్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడు.. కెరీర్ లో ఎలా సెటిల్ అవుతాడు అన్న అంశాలను ఫ్యామిలీ స్టార్ సినిమాలో చూపించనున్నాడు డైరెక్టర్. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ట్వీట్ చేసింది. సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని పార్టీ కావాలని ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. . ఆల్ ది బెస్ట్ డార్లింగ్స్ అంటూ విష్ చేసింది.

రష్మిక ట్వీట్‎కు విజయ్ రిప్లై :

ట్విటర్ లో రష్మిక…” నా డార్లింగ్స్ పరుశురామ్, విజయ్ దేవరకొండ లకు శుభాకాంక్షలు. ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ కానుంది. ఐ యామ్ సో ఎక్సైటెడ్. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నాకు పార్టీ కావాలి. మై లవ్ మృణాల్‌ ఆల్ ది బెస్ట్ ” అంటూ ట్విటర్ తన ఫ్రెండ్స్ ను మెసేజ్ చేసింది. రష్మిక ట్వీట్ కు విజయ్ క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఏప్రిల్ 5 ఫ్యామిలీ స్టార్ :

ఖుషి (Kushi) సినిమా తర్వాత విజయ్ చేస్తున్న మూవీ ఇది. లైగర్ దెబ్బతో రౌడీ బాయ్ పూర్తిగా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పైనే ఫోకస్ పెట్టాడు. అందుకే ఇప్పుడు పరుశురాం (parushuram)తో ఫ్యామిలీ స్టార్ చేశాడు. పరుశురామ్ డైరెక్షన్ లో వచ్చిన గీతా గోవిందం(Geetha Govindam) మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ సినిమ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్నల కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. అయితే డైరెక్టర్ గీతాగోవిందం కంటే.. ఫ్యామిలీ స్టార్ మూవీలో యాక్షన్ పార్ట్ పెట్టారని తెలుస్తోంది. ఈ మూవీలో మృణాల్ తో పాటు అమెరికన్ నటి మరిస్సా రోజ్ గార్డన్ (Marissa Rose Garden), మజిలీ ఫేమ్ నటి దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రష్మిక మందన్న(Rashmika Mandanna)లు కనిపిస్తారని టాక్. ఇక ఈ మూవీకి గోపిసుందర్ మ్యూజిక్ అందించారు.

ఏప్రిల్ 5 ఫ్యామిలీ స్టార్ (Family star)మూవీ రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. విజయ్, మృణాల్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాకు హైప్ తీసుకొస్తున్నారు.

Leave a Comment