Rashmika opens up about her relationship with vijay : రష్మిక మందన్న (Rashmika Mandanna)విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ల డేటింగ్ రూమర్స్ చాలా కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. డిసెంబర్ లో యానిమల్ (Animal)ప్రమోషన్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ (Balakrishna)తో అన్‌స్టాపబుల్ (Unstoppable) ప్రోగ్రామ్‌కు రష్మిక వచ్చినప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్ గురించి రోజుకో వార్త నెట్టింట్లో ప్రత్యక్షమవుతోంది.
ఈ షో లో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రష్మికకు విజయ్‌తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడటంతో వీరిద్దరి మధ్యన ఏదో ఉందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ ఇద్దరు స్టార్స్ మాత్రం తమ మధ్య ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అసలు వీరిద్దరు లవర్స? లేదా ఫ్రెండ్సా అన్న కన్ఫ్యూజన్ జనాలను ఇప్పటికీ వెంటాడుతోంది.
వీరిద్దరూ అలాంటిదేమీ లేదని చెబుతున్నా లవర్సే అని కొంత మంది ప్రేక్షకులు బ్లైండ్ గా ఫిక్స్ అవుతున్నారు.అంతే కాదు ఈ మధ్యనే విజయ్, రష్మికల ఎంగేజ్మెంట్ (Engagement)ఫిబ్రవరీలో ఉంటుందని ఓ రూమర్ కూడా నెట్టింట్లో ప్రత్యక్షమైంది.
ఓ ఇంటర్వ్యూలో విజయ్ దీనికి రిప్లై కూడా ఇచ్చాడు. ఇక లేటెస్టుగా నేషనల్ క్రష్ (National Crush) రష్మిక విజయ్ దేవరకొండ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
What I do Vijay is everywhere : నేను చేసే ప్రతీ పనిలో విజయ్ ఉంటాడు
నేషనల్ క్రష్ (Natinal Crush)రష్మిక మందన్న(Rashmika Mandanna)యానిమల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద యానిమల్ రూ.900కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) క్యారెక్టర్ తో పాటు రష్మిక పోషించిన గీతాంజలి (Geethanjali)పాత్రకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గీతాంజలి పాత్రలో రష్మిక ఒదిగిపోయిందని ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో మునిగిపోయింది. ఇక లేటెస్టుగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..”విజ్జు , నేను ఒకేసారి ఇండస్ట్రీలో వచ్చాం. నా లైఫ్ లో చాలా వరకు విషయాల్లో విజయ్ సపోర్ట్ కూడా తప్పనిసరిగా ఉంటుంది.
నేను చేసే ప్రతీ పనిలో తన ఒపీనియన్ తీసుకుంటాను. ఎందుకంటే తన ఒపీనియన్ నాకు కావాలి. అయితే మిగతావారిలా విజయ్ అన్నింటికి ఎస్ చెప్పడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. ఇది బాగుంది, ఇది బాలేదు, నేను ఇలా అనుకుంటున్నాను అని అన్నింటి గురించి మొహమాటం లేకుండా చెప్తాడు.
ఇప్పటి వరకు నా లైఫ్ లో ఎవరూ సపోర్ట్ చేయనంతగా విజయ్ నన్ను సపోర్ట్ చేశాడు. అందుకే విజయ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది” అంటూ దేవరకొండ గురించి చొప్పుకొచ్చింది రష్మిక.
Vijay clarity on engagement : ఎంగేజ్మెంట్పై విజయ్ క్లారిటీ
ఇదిలా ఉంటే విజయ్, రష్మికలు ఫిబ్రవరీలో నిశ్చితార్ధం చేసుకోబోతున్నారని త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్స్ అన్నీ కూడా ఫేక్ అని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
“నేను ఫిబ్రవరీలో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం లేదు. నేను పెళ్లి కూడా చేసుకోవడం లేదు. ప్రతీ రెండు సంవత్సరాలకు మీడియానే నాకు పెళ్లి చేయాలని చూస్తోంది. ప్రతీ సంవత్సరం నా పెళ్లి రూమర్‌ను వింటుంటాను. అందులో నిజం లేదు” అంటూ విజయ్ ఎంగేజ్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు.