Rath Saptami 2024 : రాబోయే రధ సప్తమి రోజున ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు

website 6tvnews template 44 Rath Saptami 2024 : రాబోయే రధ సప్తమి రోజున ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు

Rath Saptami 2024 : ప్రతి ఏటా సూర్య నారాయణుడి జన్మ దినోత్సవాన్ని మనం మాఘ మాసం శుద్ధ సప్తమి రోజుని రథ సప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. ఇదే రోజున మనం ఆ సూర్య దేవుడి ని ప్రత్యేక పుష్పాలు , అభిషేకాల తో పూజిస్తాం .

అంతే కాదు అందరూ తెల్లవారుతూనే లేచి నదీ స్నానం చేయడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మన హిందూ సాంప్రదాయాలకు మన విశ్వాసాలకు అతీతం గా నదీ స్నానం చెయ్యడం అనేది ఈ పవిత్రత భావిస్తారు. ముఖ్యం గా నదీ స్నానం వల్ల ఎన్నో వ్యాధులను లేదా అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.

రథసప్తమి విశిష్టత :

మన పెద్దలు చెప్పిన కదల ప్రకారం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఏడవ రోజు సప్తమి తిథిలో సూర్యభగవానుడు తన రధం మీద తిరుగుతూ మొత్తం విశ్వం అంతటతన వెలుగు ప్రసరింప చెయ్యడం మొదలు పెట్టాడు. రధం మీద సప్తమి రోజున తిరిగాడు కాబట్టి ఈ రోజును సూర్య భగవానుడు పుట్టిన రోజున మనం ఎంతో భక్తి శ్రద్ధలతో రాధా సప్తమి ని లేదా సూర్య భగవానుడు పుట్టిన రోజు గా చేసుకుంటాం

రథసప్తమి ఎప్పుడు చేసుకోవాలంటే :

ఈ తిథి మన హిందూ పంచాంగం ప్రకారం మాఘ శుక్ల పక్ష సప్తమి ఈ ఏడాది ఫిబ్రవరి 15, 2024 ఉదయం 10.15 ని ll లకు ప్రారంభం అయ్యి మరునాడు రోజు ఉదయం ఫిబ్రవరి 16 ఉదయం 8.58 ని ll లకు సప్తమి ఉంటుంది. కాబట్టి మనం ఫిబ్రవరి 16 న రాధసప్తమి ని సాంప్రదాయ పద్దతులలో చక్కగా నదీ స్నానం చేసి దీప,ధూప , నైవేద్యాలతో పూజలు చేసుకోవాలి

రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి :

రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఎవరి పైన కోపం ప్రదర్శించకూడదు. వీలైతే వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. అంతే కాకుండా ఇంట్లో నే కాకుండా మన చుట్టు పక్కల కుడా ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకుంటే మంచిది. ముఖ్యం గా ధూమ పానం. మద్యం తో పాటు మాంసాహారం తీసుకోకుండా కేవలం సాత్విక ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఈ పవిత్ర మైన రోజున ఉప్పు వాడకుంటే చాల మంచిది.

Leave a Comment