Ravi Teja : క్రేజీ ప్రాజెక్టు తో రానున్న రవితేజ..రీరిలీర్జ్ ప్లాన్ చేస్తున్న ఇళయదళపతి.
రవితేజాను మాస్ మహా రాజా అని ఊరికే అనలేదు. అతని సినిమా హిట్టయితే అది ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మాస్ ఆడియన్స్ ను తనదైన నటనతో ఆకట్టుకున్న రవితేజ ముఖ్యంగా బి, సి సెంటర్లలో యమా క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే అతనికి ఏ క్లాస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక రవితేజ తన కెరియర్ లో కొత్త వారితోనే ఎక్కువగా పనిచేశాడు.
తానూ చేసిన సినిమాల్లో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వచించిన వారు కొత్త డైరెక్టర్లే. పైగా రవి తేజ సినిమాలతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు స్టార్ డైరెక్టర్లుగా మారిపోయారు. అలా స్టార్ డైరెక్టర్ గా మారిన వారిలో గోపి చంద్ మలినేని ఒకరు.
ఈ మధ్యనే ఈ దర్శకుడు నటరత్న నందమూరి బాల కృష్ణ తో వీర సింహా రెడ్డి సినిమా తీసి భారీ హిట్టుకొట్టాడు. మరో వైపు రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా సినిమా చేసి అదరహో అనిపించదు.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. RT 4 GM అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ గత సినిమా వీర సింహా రెడ్డి కూడా మైత్రి మూవీ మేకర్స్ పతాకం పైనే తెరకెక్కింది.
నవంబర్ నెలాఖరు నుండి ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది, ఈ మొదటి షెడ్యూల్ లో డైరెక్టర్ యాక్షన్ సీన్లు ప్లాన్ చేశాడట. అయితే రవి తేజ గోపీచంద్ కంబినేషన్ లో డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు వచ్చాయి. అందుకే ఈ సినిమా వర్కింగ్ టైటిల్ కూడా RT 4 GM అని పెట్టారు. ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు మంచి సక్సస్ ను సొంతం చేసుకుని గొప్ప వసూళ్లు రాబట్టాయి.
ఇక మాస్ మహారాజ రవితేజ తో పటు ఈ ఏడాది దసరా సమయంలో తెరమీదకి వచ్చిన మరో హీరో విజయ్, ఈ తమిళ హీరో లియో అనే అనువాద చిత్రం తో తెలుగువారిని పలుకరించాడు. ఇళయదళపతికి తెలుగులో ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని లియోను తెలుగు స్టేట్స్ లో కూడా భారీగానే రిలీజ్ చేశారు.
అయితే ఇక్కడ లియో అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ, తమిళ్ లో మాత్రం బాగా నడుస్తోంది. మొత్తం మీద చుస్తే ఇప్పటివరకు దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది లియో. సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతున్నప్పటికీ తమిళనాట ఇంకా మంచి రన్ వస్తోందటఈ సినిమాకి.
ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్లు మరో 100 థియేటర్లలో లియో మూవీని రీ రిలీజ్ చేయడానికి న్ చేస్తున్నారట. అందుకే అంటారేమో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు మెల్లగా ఎక్కుతాయి అని.