RBI decision regarding payments: పేమెంట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం.
భారతీయ రిజర్వ్ బ్యాంకు ఒక కొత్త ప్రకటన చేసింది. అదనపు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేకుండా లేకుండా నిర్దిష్ట లావాదేవీల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ఆటో చెల్లింపుల పరిమితులను పెంచేలా ప్రతిపాదించాలని నిర్ణయించినట్టు తెలిపింది.
ఆ ప్రకటన ప్రకారం ఒక లక్ష రూపాయల వరకు చేసే ట్రాన్సక్షన్ వన్ టైం పాస్వర్డ్ ను ప్రామాణికంగా చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే ఇది అన్నిటికి వర్తించదు. కేవలం కొన్నిటికి మాత్రమే వర్తిస్తుందని చెబుతున్నారు,
అవేమిటో ఒక్కసారి చూద్దాం.మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లు అలాగే క్రెడిట్ కార్డ్ రీపేమెంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది.
ప్రస్తుతం ఈ సడలింపులు ఆస్పత్రులతోపాటు, విద్యాసంస్థలకు ఉంది. వీటిలో పేమెంట్లు చేసే సమయంలో యూపీఐ పేమెంట్లకు ఒకసారి పేమెంట్ చేసేందుకు 1 లక్ష రూపాయల వరకు ఎటువంటి ఓటీపీ లేకుండానే అనుమతి ఉంటుంది.
తాజాగా దీన్ని 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఫలితంగా వినియోగదారులు ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో పేమెంట్ చేసే సమయంలో యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో చెల్లించే వీలు కలిగింది.
ఇప్పటివరకు రీకరింగ్ చెల్లింపుల కోసం ఇ-మ్యాండేట్ 15 వేల రూపాయలు ఉండేది. అయితే ఆర్బీఐ అందులో కూడా సడలింపు తెచ్చింది. 15 వేల రూపాయల నుండి దానిని ఒక లక్ష రూపాయల వరకు తీసుకొచ్చింది. ఒకప్పుడు 15 వేళా రూపాయలు దాటితే
‘అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్’ విధానం ప్రకారం వినియోగదారుడు ప్రత్యేకంగా పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు లక్ష రూపాయల వరకు కూడా ఎటువంటి పర్మిషన్లు అవసరం లేదు.
దీని వల్ల మనం ప్రతి నెలా చెల్లించే చెల్లిపుల్లో అనుమతుల బెడద తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్, క్రెడిట్ కార్డు పేమెంట్స్, బీమా ప్రీమియంలు ఉన్నాయి.
ఫిన్‌టెక్ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ‘ఫిన్‌టెక్ రిపాజిటరీ’ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్ దీనిని 2024 సంవత్సరంలో ఏప్రియల్ నెలలో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. వీలయితే ఏప్రియల్ కన్నా ముందు కూడా ప్రవేశ పెట్టొచ్చు.
దేశంలోని బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. అందుకే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే మరో విషయం ఏమిటంటే కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని, వాటిని యధాతధంగా ఉంచుతున్నామని ప్రకటించారు. ఈ కారణంగానే రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది.