RBI Shock To Paytm: భారత దేశం(India) లో బాగా ప్రాచుర్యం పొందిన ఫిన్‌టెక్ సంస్థలలో పేటీఎం(paytm) కూడా ఒకటి, అయితే ఇప్పుడు ఈ పేటీఎం కు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా9Reserve Bank Of India) పెద్ద షాకే ఇచ్చింది.
ఈ సంస్థ కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోవడాన్ని ఆర్బీఐ(RBI) నిషేధించింది. ఫిబ్రవరి 29వ తేదీ తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించడం నిషేధమని పేర్కొంది. ఆర్బీఐ ఇచ్చిన ఈ నిషేధ ఆగ్నల పై ఆ సంస్థ సీఈవో విజయ్ శేఖర్(Paytm CEO Vijay Sekhar) కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
సీఈవో విజయ్ ఏమన్నాడంటే ? CEO Vijay Statement
ఆర్బీఐ డిపాజిట్లు తీసుకుకోవద్దు అంటూ నిషేధం విధించడం పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరికి తీరుతుంది అని అన్నారు. ఈ క్రమం లోనే అయన పేటీఎం మొదలైన తొలి నాళ్లను గుర్తుచేసుకున్నారు.
పేటీఎం సేవలను ఆవిష్కరణ తరువాత భారత దేశానికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందని అన్నారు. డిజిటల్ ట్రాన్సక్షన్ విషయంలో పేటీఎం కొత్త ఒరవడి సృష్టించిందని అన్నారు. అందుకు నిదర్శనంగానే ఎక్కువ శతం మంది పేటీఎం సేవలను వినియోగించుకున్నారని అన్నారు. ఇప్పటికీ పేటీఎం కి ప్రజల్లో ఆ ఆదరణ ఉందని పేర్కొన్నారు.
ఎన్ని కోట్లు నష్టమంటే : Loss In Crores
సంస్థ సీఈవో ఇంత నిబ్బరంగా మాట్లాడుతున్నప్పటికీ పేటీఎం షేర్ల విషయంలో మాత్రం చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 40 శాతం క్షీణినించాయి. జనవరి 31 వ తేదీ నాటికి 761 రూపాయలు గా ఉన్న ఈ షేర్ల విలువ ఫిబ్రవరి 1వ తేదీన 20 శాతం, ఫిబ్రవరి 2వ తేదీన మరో 20 శాతం తగ్గింది. ఇప్పుడు ఈ కంపెనీ షేర్ విలువ 487రూపాయల వద్ద కొనసాగుతోంది.
19.99% ఎన్ఎస్ఈ లో నష్టపోవడం వల్ల దీని లోయర్ సర్క్యూట్ 609 రూపాయలకు చేరింది. ఫలితంగా ఫిబ్రవరి 1వ తేదీ ముగిసేనాటికి 9వేల,646.31 కోట్లు నష్టపోయి 38 వేల,663.69 కోట్ల వద్దకు చేరుకుంది. ఇది ఆ కంపెనీకి నిజంగా పెద్ద దెబ్బె అంటున్నారు ట్రేడ్ నిపుణులు.