Real meaning of Diwali : దీపావళికి నిజమైన అర్ధం ఏమిటో తెలుసా.దీపంలో ఉన్న ఆ ముగ్గురు దేవతలెవరో చూడండి.
Deewali : దీపావళికి నిజమైన అర్ధం ఏమిటో తెలుసా..దీపంలో ఉన్న ఆ ముగ్గురు దేవతలెవరో చూడండి..
దీపావళి పండుగ అంటే దీపాల పండుగ, ఈ దీపాల వెలుతురు నిరాశానిస్పృహలు, అజ్ఞానాన్ని పారద్రోలి అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ఆనందాలను ప్రసాదిస్తుంది అని నమ్మకం, మన పెద్దలు కూడా ఈ మాటలనే చెప్పేవారు.
దీపం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అని కొన్ని పురాణాలూ చెబుతున్నాయి. అందుకే సాయంత్రం సమయంలో ఇంట్లో దీపాన్ని వెలిగించిన వెంటనే లక్ష్మీదేవిని తలచుకుంటారు ఎక్కువ మంది.
దీపలక్ష్మికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తే సకల సంపదలూ లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ముందుగా జ్యోతి ప్రజ్వళనతోనే మొదలు పెడతారు.
ఒక దీపం వెలిగించినప్పుడు మనకు మూడు రకాల కాంతులు కనిపిస్తాయి. బాగా తీక్షణంగా చుస్తే తెలుపు, నీలం, ఎరుపు రంగులలో దీపం మనకు కనిపిస్తుంది. ఈ మూడు రంగులు త్రిమూర్తులకు ప్రతీక అంటారు. నీలం రంగు విష్ణుమూర్తి, తెలుపు పరమేశ్వరుడు, ఎరుపు బ్రహ్మదేవుడు.
ఇక దీపావళి పండుగ చేసుకోవడానికి మూడు ఇతివృత్తాలను మనం చూడోచ్చు. వాటిలో మొదటిది చూస్తే ద్వాపరయుగం నాటి మాట, ఈ యుగంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని వరం పొందుతాడు.
కేవలం తల్లి చేతిలో తప్ప మృత్యువు ఉండదని బ్రహ్మ వరాన్ని ప్రసాదించడంతో, నరకుడు దేవతలను మహర్షులను మానవులను హింసిస్తూ ఉంటాడు.
వారంతా విష్ణు మూర్తికి మొరపెట్టుకోవడంతో, శ్రీ కృష్ణ రూపంలో ఉన్న అయన భూదేవి రూపంలో ఉన్న సత్య భామ సమేతుడై వెళ్లి నరకుడిని వధిస్తాడు. లోక కంఠకుడైన నరకాసుడు మరణించడంతో ప్రజలు ఆనందంతో దీపావళి చేసుకుంటారు.
మరో ఇత్రివృత్తం చుస్తే ఇది త్రేతాయుగం నాటిది. శ్రీరాముని భార్యను రావణాసుడు అపహరించి లంకలో నిర్బంధిస్తాడు. వానరసైన్యంతో వెళ్లిన శ్రీరాముడు రావణుడిని సంహరించి ఏయుద్యకు సీతా లక్ష్మణ హనుమత్ సమేతుడై వస్తాడు.
కానీ ఆరోజు అమావాస్య కావడంతో అయోధ్య ప్రజలు దీపాల వెలుతురులో రాముడిని స్వాగతిస్తారు, కాబట్టి అప్పటి నుండి దీపాల వెలుతురు తో దీపావళి పండుగ చేసుకుంటున్నారు.
మూడో వృత్తాంతం ఏమిటంటే.. దేవ దానవులు కలిసి వాసుకిని తాడుగా చేసి మందగిరి అనే కొండను కవ్వంగా మార్చి క్షీర సాగర మధనం చేస్తారు.
మరి కవ్వం మోయడానికి మహా విష్ణువే స్వయంగా కూర్మావతారం ఎత్తి మందగిరిని తన వీపుపై మోస్తాడు. అప్పుడు మధనం మొదలుపెట్టగా ముందు హాలాహలం పుట్టింది.
మరోసారి మధనం చేయగా కామధేనువు పుడుతుంది. ఆతరువాత వరుసగా ఉచ్చైశ్రవము, ఐరావతం, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, మహాలక్ష్మి పుడతారు.
సకల లోకాలకు సంపదను ఇచ్చే లక్ష్మీదేవిని మహా విష్ణువు చేపడతారు. లక్ష్మి దేవి దీపానికి ప్రతీక కాబట్టి దీపావళిని నిర్వహించుకుంటారు.