Reason Behind Downfall of paytm : మనీ ట్రాన్స్ఫర్ యాప్ అయిన paytm కు భారతీయ రిజర్వ్ బ్యాంకు సరియైన నిభంధనలు పాటించని కారణం గా కస్టమర్స్ దగ్గరనుంచి డిపాజిట్లు సేకరించడం కాని, క్రెడిట్ ట్రాన్సాక్షన్ లు కాని చెయ్యకూడదని ఒక ప్రకటన విడుదల చేసింది.
దీని వల్ల paytm బ్యాంక్ కు సంబందించిన పలు రకాల సర్వీస్ లు ఆగిపోనున్నాయి. అంటే ఈ నెల 29 నుండి పలు రకాల సర్వీస్ క్రిందకి వచ్చే వాలేట్స్,ఫాస్ట్ టాగ్, ప్రి పెయిడ్ ట్రాన్సాక్షన్ లు , టాప్ అప్ లు ఆగిపోతాయి . దీని వల్ల paytm బ్యాంక్ పై తీవ్ర ప్రభావం పడుతుందని కస్టమర్స్ ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది.
రిజర్వ్ బాంక్ జరిపిన ఆడిట్ ప్రకారం paytm బ్యాంక్ లో పలురకాల తప్పులు గుర్తించామని అన్ని పరిశీలించిన తర్వాతే paytm బ్యాంక్ మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపింది. అంతే కాకుండా paytm.
పేమెంట్ బ్యాంకు లిమిటెడ్ సంబందించిన నోడల్ అకౌంట్లు కూడా కాన్సిల్ చేసామని రిజర్వ్ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది . అయితే paytm ఖాతాదారుల కు సంబందించిన తమ డబ్బును వినియోగించుకోవడానికి రిజర్వ్ బ్యాంకు వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించ లేదని తెలిపింది.
అంతే కాకుండా మని రిఫెండు , మని క్యాష్ బ్యాక్ వంటి సర్వీస్ ల మీద కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్ ప్రకారం మానిటరి పోలసీ లు , వాటికి సంబందించిన రూల్స్ పాటించక పోవడం వల్లనే ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఒక ప్రకటన విడుదల చేసింది , ఇది వరకు 2022 సంవత్సరం లో.
కూడా ఒక సారి భారతీయ రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంది, అంతే కాకుండా కస్టమర్స్ వద్ద నుంచి డిపాజిట్లు తీసుకోవడం కాని ఇదే స్కీం లో కొత్త కస్టమర్స్ చేర్చుకోవడం కాని చెయ్యకూడదని చెప్పామని దీనికి సంబందించి ఆ సంయమలో కొన్ని నిభందనలు పాటించాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొంది . అయితే అప్పటి నుంచి పలు మార్గాలలో paytm నిభందనలు వదిలి తన కార్యకలాపాలను కొనసాగించింది
పేకమేడల కూలిన షేర్లు :
రిజేర్వ్ బాంక్ చర్యల వల్ల paytm బ్యాంకు షేర్లు కుప్ప కూలిపోయాయి . దాదాపు 20 % షేర్లు పతనం అయినట్ల్యు తెలుస్తోంది. అయితే UPI పేమెంట్ లపై ఎటువంటి ప్రభావం చూపదని సెంట్రల్ బ్యాంకు స్పష్టం చేసింది , దీనిపై paytm బ్యాంకు మేనేజిమెంట్ అధికారంకంగా స్పందించాల్సి ఉంది