Reliance Industries Ltd: ప్రపంచంలో ఎక్కడైనా తగ్గేదే లేదంటున్న రిలయన్స్.
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది, బిజినెస్ కొత్త రూపం సంతరించుకుంటుంది. వివిధ రూపాలలో తయారైన వస్తువుల అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే ప్రపంచం చాలా చిన్నది గా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది.
ప్రపంచంలోని టాప్ 10 వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటిగా రిలయన్స్ ఇండస్ట్రీస్- ఆర్‌ఐఎల్ నిలవాలనే లక్ష్యం తో ముందుకు సాగుతుందని సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.
ఆ కల నెరవేరేదాకా కంపెనీ గానీ తాను గానీ ఏ దశలో కూడా నిదర పోమని చెప్పారు. ధీరూభాయ్ అంబానీ జయంతిరిలయన్స్ ఫ్యామిలీ డే కార్యక్రమంలో గ్రూప్ ఉద్యోగులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ ప్రసంగిస్తూ..
ప్రపంచంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్- ఆర్‌ఐఎల్, అతిపెద్ద చమురు రిఫైనింగ్ కాంప్లెక్స్‌తో పాటు దేశంలోనే అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ జియోను కలిగి ఉందని గుర్తుచేసారు.
అయితే, ఆర్‌ఐఎల్ ఎప్పుడూ ముందే ఉంటుందని, వ్యక్తిగతంగా వెనకడుగు వేసేది లేదని ముకేశ్ అంబానీ తెలిపారు.
ప్రపంచంలోని అగ్రగామి 10 దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఆర్‌ఐఎల్ నిలవాలన్నది తమ లక్ష్యమని దానికోసం ఎంతటి శ్రమ అయినా భరిచాటానికి సిద్ధంగా ఉన్నామని అయన వెల్లడించారు.
డిజిటల్ డేటా ప్లాట్‌ఫామ్స్, ఏఐ (కృత్రిమ మేధ) వంటి విభాగాల్లో ఇంటర్నేషనల్ కంపెనీల వరసన చేరే ఉద్దేశంతో రిలయన్స్ ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపారంలో వేగంగా దూసుకుపోతుంది.
మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా వేగంగా మారాలని, ఎప్పుడూ నిరాశ చెందకూడదని ఆయన చెప్పారు. వినూత్న ప్రయత్నాలతో మార్కెట్లలో విప్లవాన్ని తీసుకురావడమే రిలయన్స్ సంస్థ లక్ష్యమని ముకేశ్ అంబానీ తెలిపారు.
జౌళి తయారీకి నెలకొల్పిన చిన్న ప్లాంటు నుంచి పెట్రోరసాయనాల్లోకి అడుగుపెట్టి, దేశంలోనే అతిపెద్ద తయారీదారుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మారిందని తెలిపారు.
ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రిఫైనింగ్ కాంప్లెక్స్‌గా మారిందన్నారు. ఇక 2005లో రిటైల్ రంగంలో ప్రవేశించి ఇప్పుడు దేశంలోనే అగ్రస్థాయిలో ఉన్నామని ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు.