Supreme Court: సుప్రీం కోర్ట్ లో జయప్రదకు ఊరట.

Relief for Jayaprada in the Supreme Court.

Supreme Court: సుప్రీం కోర్ట్ లో జయప్రదకు ఊరట.

మద్రాసు పట్టణంలో సినీ నటి జయప్రద ఒక సినిమా థియేటర్ ను కొంత కాలం పాటు నిర్వహించారు. అయితే కాలక్రమంలో ఆ థియేటర్ కు నష్టాలు రావడంతో దాన్ని నిర్వహించే సత్తా లేక మూసివేశారు.

అయితే ఈ విషయంలో కార్మికులు కన్నెర్రజేశారు. తమకు సంబంధించిన ఈఎస్ఐ బకాయిలు చెల్లించలేదంటూ థియేటర్ కార్మికులు ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ విషయంలో మాజీ ఎంపీ జయప్రదకు ఈ కేసులో జయప్రదకు ట్రయల్ కోర్టు శిక్షను విధించింది. 6 నెలల జైలు శిక్ష తీర్పును సవాల్ చేస్తూ జయప్రద మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా జయప్రదకు చుక్కెదురైంది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఈ వార్తలు అప్పట్లో వైరల్ కావడంతో జయప్రద కటకటాలు లెక్కపెట్టడం ఖాయమే అనుకున్నారు అంతా, కానీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

చెన్నై ఎగ్మోర్ లోని ట్రయల్ కోర్టు ఆమెకు విధించిన 6 నెలల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. జయప్రద పిటిషన్ పై తదుపరి విచారణ ముగిసేంత వరకు శిక్షపై స్టే విధిస్తున్నట్టు సుప్రీం కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జయప్రద ఈ మధ్య తెలుగు సినిమాలలో అంత యాక్టీవ్ గా కనిపించడం లేదు. ఆమె పొలిటికల్ లైఫ్ చుస్తే 2004, 2009 లో రామ్ పూర్ స్థానం నుండి ఎంపీగా గెలుపొందారు. అంతకముందు ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

1994 లో ఎన్టీఆర్ పిలుపు తో ఆమె రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ పదవీత్యుతుడు అయినా సమయంలో ఆమె చంద్రబాబు పక్షాన నిలిచారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె హిందీ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తూ ఉన్నారు. ఆమె చేతి నిండా కేసినిమాలు లేవో.

లేదంటే ఆవిడే సినిమాలు ఒప్పుకోవడం లేదో తెలీదు కానీ ఎప్పుడైనా ఒక్క సినిమా చేస్తూ నేను కూడా ఉన్నాను అని రాణిస్తున్నారు. వాటికి తోడు టీవీల్లో వచ్చే రియాలిటీ షోలలో మెరుస్తున్నారు.

Leave a Comment