Breaking News

Restrictions on Diwali crackers : దీపావళి టపాసులపై హైదరాబాద్ సీపీ ఆంక్షలు.

ezgif 2 8cb9012912 Restrictions on Diwali crackers : దీపావళి టపాసులపై హైదరాబాద్ సీపీ ఆంక్షలు.

Restrictions on Diwali crackers : దీపావళి టపాసులపై హైదరాబాద్ సీపీ ఆంక్షలు..ఆరెండు గంటల తరవాత కాల్చితే ఏమవుతుందో తెలుసా..ఈ దీపావళికి ఎలాంటి బాణాసంచా కాల్చాలంటే..

దీపావళి పండుగ వచ్చిందంటే చిన్న పెద్దా తేడా లేకుండా అంతా సంబరంగా గడుపుతారు. దీపావళి పండుగ కోసం కొంత మంది ఆతృతగా ఎదురు చూస్తుంటారు.

దానికి కారణం లక్ష్మీదేవి పూజ ఒకటయితే, అంతకన్నా పెద్ద కారణం టపాసులు కాల్చుకోవడం. టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది అని చెప్పినప్పటికీ ఆ ఒక్క రోజు మా లాంటి చిన్న పిల్లలకు ఛాన్స్ ఇవ్వాల్సిందే అంటుంటారు.

అయితే ఈ సంవత్సరం దీపావళి టపాసుల వెలుతురులపై ఆక్షలు పడనున్నాయి. అందులోను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఆ ఆంక్షలు ఇంకాస్త కఠినంగా ఉండనున్నాయి. దేశ వ్యాప్తంగా టపాసులు కాల్చడంపై సుప్రీం కోర్ట్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

వాటిని అనుసరించే పాటాకాలు కాల్చుకోవాలి. ఒక వేళ ఎవరైనా రూల్స్ ను అతిక్రమిస్తే తప్పకుండ శిక్షార్హులు అవుతారు.

సుప్రీం కోర్టు దీపావళి సందర్బంగా పటాకులు పేల్చడం పై కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో అన్ని రకాల బాణసంచా పై నిషేధం విధించలేదని స్పష్టం చేసింది.

బేరియం సాల్ట్ ఉపయోగించిన క్రాక్కర్స్ పై మాత్రమే నిషేధం విధించినట్లు వెల్లడించింది. కాబట్టి బేరియం సాల్ట్ ఉన్న క్రాకర్స్ కొని కాల్చి తే మీరు ఇబ్బందుల పాలుకాక తప్పదు.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవడానికి అనుమతి ఇచ్చారు.

బహిరంగ ప్రదేశాల్లో రాత్రి 8 నుంచి 10 గంటల తరువాత బాణాసంచా కాల్చడాన్ని నిషేధించారు. ఈనెల 12 నుంచి 15 వరకు ఈ ఆదేశాలు అమలు లో ఉంటాయని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య నగర ప్రజలకు తెలియజేశారు.

పర్యావరణ అనుకూలమైన,సురక్షితమైన దీపావళిని ప్రజలు నిర్వహించుకోవాలని అంటున్నారు. నగర ప్రజలు మామూలు బాణాసంచా కి బదులుగా గ్రీన్ క్రాకెర్స్ కాల్చుకోవాలి ఆయన సూచించారు.

ఈ ఆదేశాలను అతిక్రమించిన వారికీ హైదరాబాద్ పోలీసు చట్టం 1348/11 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఈ దీపావళి ఆంక్షల నడుమే జరగనుందని చెప్పడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *