Gurukula Results 9210 Posts: 9210 గురుకుల పోస్టుల ఫలితాలు.

Add a heading 2024 01 02T123223.960 Gurukula Results 9210 Posts: 9210 గురుకుల పోస్టుల ఫలితాలు.

Gurukula Results 9210 Posts: బిసి, ఎస్సి, ఎస్టీ గురుకులాల్లో పోస్టుల కోసం పరీక్షలు వ్రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక వార్త. గురుకులాల్లో ఖాళీగా ఉన్న 9210 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించన పరీక్షా ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నట్టు తెలుస్తోంది.

ఈ సమాచారం అందడంతో గురుకుల నియాలక బోర్డు తగు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఫలితాల వెల్లడి విషయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల(Telangana High Court)

నుండి క్లారిటీ వచ్చిన వెంటనే 1:2 నిష్పత్తిలో జాబితాలను ప్రకటించాలని ప్లాన్ చేసుకుంటోంది. ఇక జాబితా అమతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

ఆ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. రిసల్ట్ రిలీజ్ నుండి జాయినింగ్ లెటర్ అందించేంత వరకు చూసుకుంటే సుమారుగా మూడు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

మహిళల కి సమాంతర రిజర్వేషన్ : Parallel reservation for women

మహిళల కి సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలనీ కోరుతూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది.

సుప్రీం కోర్ట్ ఆదేశాలను అనుసరించి మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేసి తీరాల్సిందే అని పేర్కొంది. కాబట్టి ఈ అంశంపై కొంత స్పష్టతను ఇవ్వాలని గురుకుల బోర్డ్ కూడా హై కోర్ట్ ను ఆశ్రయించింది.

ఆ స్పష్ట తోనే తాము ఫలితాలను వెల్లడించేందుకు వీలవుతుందని న్యాయస్తానానికి విన్నవించింది. ఇక ఎప్పుడైతే తెలంగాణ హై కోర్ట్ ఈ విషయంలో స్పష్టతను ఇస్తుందో ఆ తదుపరి వెల్లడించే ఫలితాలు డిగ్రీ లెక్చరర్(Degree Lecturer) లవే ఉంటాయని తెలుస్తోంది,

వీటి తరువాత జూనియర్ లెక్చరర్, ఆతరువాత పిజిటి ఫలితాలు వెల్లడికొస్తారట. ఫలితాల మాటపక్కనపెడితే ఈ దఫా సర్టిఫికెట్ల వెరిఫికేషన్(Certificates Verification) కోసం స్లాట్ పద్ధతినిప్రవేశపెట్టనున్నారు.

దీన్ని ఉపయోగించుకుని అభ్యర్థులు పత్రాల దృవువీకరణ కోసం వారికి అనుకూలమైన తారీఖులు, సమయాన్ని ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది.

వచ్చే విద్యాసంవత్సరానికి రెడీ చెయ్యాలని ప్రణాళిక : The plan is to prepare for the next academic year

ప్రత్రాల ద్రువీకర కార్యక్రమం మొత్తం పూర్తవడానికి హీనపక్షంగా నెల రోజులు పెట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రోగ్రాం మొత్తం పూర్తయ్యాక,

ఎంపికైన అభ్యర్థులకు వేసవికాలం లోనే ట్రైనింగ్ ఇచ్చి నట్లయితే రానున్న విద్యా సంవత్సరం కోసం వారిని సిద్హం చేసినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వం అప్పట్లో నిర్వహించిన 9210 పోస్టుల పరీక్షలకు సంబంధించిన వాటిలో ఎక్కువ శాతం టిజిటి(TGT) పోస్టులే ఉన్నాయి. టిజిటి లో 4020 పోస్టులు,

2008 జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్(Physical Director), లైబ్రేరియన్(Librarian) పోస్టులు ఉన్నాయి. ఇక పీజీటీ(PGT) పోస్టులు 1276 ఉన్నట్టు సమాచారం.

డిగ్రీ కళాశాలల విషయానికి వస్తే, డిగ్రీ లెక్చరర్ పోస్టుల జాబితా చుస్తే అందులో మొత్తం 868 ఖాళీలు ఉండగా వాటిలోనే డిగ్రీ లెక్షరర్లు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు ఉన్నాయి.

ఇవి కాకుండా వీటితోపాటుగా 434 లైబ్రేరియన్ పోస్టులు, 124 సంగీత టీచర్ పోస్టులు, 94 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.

Leave a Comment