CM Revanth Reddy reviewing public: ప్రజాభవన్ లో ప్రజల దరఖాస్తులు సమీక్షిస్తున్న రేవంత్ రెడ్డి.

Revanth Reddy reviewing public applications in Praja Bhavan.

CM Revanth Reddy reviewing public: ప్రజాభవన్ లో ప్రజల దరఖాస్తులు సమీక్షిస్తున్న రేవంత్ రెడ్డి.

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది కాంగ్రేస్.
ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ సీఎం గా డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసాడు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసారు.

అనంతరం ప్రజలని ప్రజాదర్భార్ కి ఆహ్వానించాడు రేవంత్ రెడ్డి. ప్రగతి భావం ని జ్యోతిరావు పూలె ప్రజా భవన్ గా మార్చనున్నటు ఆయన తెలిపారు. అలాగే ప్రజాభవన్ కి ఎవరైనా రావచ్చు, ఎలాంటి నిభందనలు, ఆంక్షలు లేవని స్పష్టం చేసారు. ఈ ప్రజాదర్బార్ నిర్వహణని విజయవంతం చేయాలని కోరారు.

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే కీలక నిర్ణయం తీసుకున్నారు, అదేంటంటే ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలన్నీ తొలగించాలని ఆదేశించారు, ఆ మేరకే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెలను జేసీబీతో, గ్యాస్ కట్టర్ లతో తొలగింపజేశారు

సీఎం అధికారిక ప్రమాణ స్వీకారం, ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు తొలగిపోవడం రెండు ఒకేరోజు జరిగాయి.జ్యోతిరావు పూలె ప్రజా భవన్ గా మారనున్న ప్రగతిభవన్ ఇక ప్రజల భవనం అయినట్టే.

సమయంతో సంబంధం లేకుండా ప్రగతి భావం కి ఎప్పుడైనా వచ్చే అధికారం ఉందని, ఈ ప్రజాదర్బార్ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుందని, ప్రజలంతా వచ్చి ఈ ప్రజాదర్బార్ లో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు నూతన తెలంగాణ ముఖ్యమంత్రి.

Leave a Comment