Revanth resigned MP: MP పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.
తెలంగాణ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసాడు, వివరాల్లోకెళ్తే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి అతని ఎంపీ పదవికి రాజీనామా చేసాడు.
ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ నేతలైన కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇంకా
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే లతో పాటు ప్రముఖులతో రేవంత్ సమావేశమయ్యాడు. సమావేశానంతరం తన ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా వారిని కోరాడు.
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ MLA గా గెలుపొందాడు. రేవంత్ రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కి ఒక లేఖ సమర్ఫించారు.
అనంతరం 66వ నెంబర్ గదిలో వివిధ పార్టీల ముఖ్యులతో, ఎంపీలతో మాట్లాడారు, వారంతా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసారు.
హైదరాబాద్ లో 2 రోజులుగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి ఎంపిక మొత్తానికి ఖరారైంది. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా నిర్ణయించగా ఈ గురువారం అయన ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
హైదరాబాద్ లోని LB స్టేడియంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. దాదాపు 18 మంది మంత్రివర్గంలో ఉండవచ్చని నివేదికల నుంచి సమాచారం.
మంత్రి పదవిని కోరుకున్న మరో ఇద్దరు నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి , భట్టి విక్రమార్కలను సమాధానపరచి వారికీ నచ్చిన శాఖలను అప్పజెప్పారని సమాచారం.