Saree Movie Announced by RGV: సారీ సినిమాతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన RGV.

RGV became a hot topic in the media with the movie Sari.


Saree Movie Announced by RGV: సారీ సినిమాతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన RGV.

RAM GOPAL VARMA.. సంచలన దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రి చరిత్రలోనే అతనికి పేరుంది.
శివ, సత్య, సత్య 2, రక్త చరిత్ర వంటి సంచలన చిత్రాలు తియ్యగాలిగే సత్తా అతనికి మాత్రమే ఉంది.

ఇవి మాత్రమే కాదు, లేడి ఓరియెంటెడ్ లో డేంజరస్, నాకెడ్ వంటి బొల్డ్ చిత్రాలు తియ్యాలంటే కేవలం అతనికి మాత్రమే సాధ్యం.

అతని సినిమాలే కాదు, మాటలు కూడా ఎప్పడూ సెన్సేషనల్ గా నిలుస్తాయి. ఎక్స్ వేదికగా అతను పట్టే ట్వీట్లు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారతాయి.

బొల్డ్ గా ఏది మాట్లాడాలని అనిపిస్తే ముక్కు సూటిగా అదే మాట్లాడతాడు.అలా ఇతను పెట్టిన కామెంట్ ల వల్ల కూడా ఫేమస్ అయ్యి ఇప్పడు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు.

RGV వల్ల ఫేమ్ వచ్చిన వాళ్ళు :

ఒక ఇంటర్వ్యూ లో ఇంటర్వ్యూ చేస్తున్న ARYANA GLORY ని పొగిడాడు, ఆ పొగడ్త ఎంత దూరం వెళ్ళిందంటే, ఆ పొగడ్తకి తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా సోషల్ మీడియా ఆమెని వెతికాయి.

ఈ దెబ్బకి అతి పెద్ద రియాలిటీ షో గా పేరున్న BIG BOSS లోకి వెళ్లేందుకు అవకాశం వచ్చింది.
ఆ తర్వాత ఆమె కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.

INAYA SULTHANA తో కలిసి RGV డాన్స్ చేసే వీడియొ వైరల్ కావడంతో ఆమె కూడా ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించుకుంది, బిగ్ బాస్ లో చోటు సంపాదించుకుంది.

చీర అమ్మాయితో SAREE సినిమా :

కొద్ది రోజుల క్రితం RGV ఒక అమ్మాయి రీల్ పోస్ట్ చేసి ఈ అమ్మాయి ఎవరో చెప్పండి అని పెట్టాడు, ఓవర్ నైట్ లో ఆ అమ్మాయి సోషల్ మీడియాలో సెలిబ్రిటీగా మారిపోయింది.

ఆమె మళయాళంకి చెందిన శ్రీలక్ష్మి సతీష్ అని ఆమె గురించి వివరాలు కనుక్కున్న RGV, వెంటనే ఆమె అకౌంటుని ఫాలో చేశాడు. ఆమె విడియోలు పోస్ట్ చేసి, SAREEఅనే సినిమా చేస్తాను అని రాశాడు.

కొద్ది నెలల క్రితం జరిగిన ఈ సంఘటన దాదాపు అందరు మర్చిపోయారు, వ్యూహం సినిమాలో బిజీ గా ఉన్న RGV ఇంత షాకింగ్ గా SAREE సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తాడని ఎవరు ఊహించలేదు.

ఆ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి SAREE సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. పోస్టర్ చూసిన ప్రేక్షకులు ఇంకా షాక్ లోనే ఉన్నారు.

Leave a Comment