Kantara Prequel: కాంతార 2 లో కత్తిలాంటి హీరోయిన్

WhatsApp Image 2024 03 25 at 9.43.47 AM Kantara Prequel: కాంతార 2 లో కత్తిలాంటి హీరోయిన్

కేజీఎఫ్ (KGF ) తర్వాత ఆ లెవెల్ లో బ్లాక్ బస్టర్ సాధించిన కన్నడ మూవీ ‘కాంతార’ (Kantara ). కన్నడనాట సెన్సేషనల్ హిట్ సాధించిన ఈ మూవీకి మంచి టాక్ రావడంతో ఇతర భాషల్లో నూ విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లోనూ మూవీ ఈ ఒక్క సినిమాతో డైరెక్టర్ గా,హీరోగా రిషబ్ శెట్టి (Rishab Shetty ) దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అన్ని ఇండస్ట్రీస్ అత్యద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. త్వరలో కాంతార ప్రీక్వెల్ రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా కాంతార 2 నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు కత్తిలాంటి హీరోయిన్ ను మేకర్స్ సెలెక్ట్ చేశారు.

హీరోయిన్ గా రుక్మిణి వ‌సంత్ :

కాంతారా హిట్ తో రిషబ్ ఇప్పుడు కాంతార` ప్రీక్వెల్ (Kantara Prequel ) ను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా $అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. గత కొన్ని నెలలుగా కాంతార ప్రీక్వెల్ పనుల్లో నిమగ్నమయ్యడు రిష‌బ్ శెట్టి. ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియాలో భారీ బ‌డ్జెట్ తో హొంబ‌లే ఫిల్మ్ (Homble films )ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్ప‌టికే కథ కూడా పూర్తయింది . ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రంలో సప్త‌సాగ‌రాలు(Saptasagaralu ) ఫేమ్ నటి రుక్మిణి వ‌సంత్ (rukmini vasanth) ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు.

e15c91ec 1ac5 48e8 ac5c eedfa75c43ed Kantara Prequel: కాంతార 2 లో కత్తిలాంటి హీరోయిన్

కన్నడ భామకే ప్రయారిటీ :

కాంతార ప్రీక్వెల్Kantara Prequel ) లో రిష‌బ్ శెట్టి (Rishab Shetty ) రాసిన క్యారెక్టర్ కు
సరిపోయే హీరోయిన్ కోసం రీసెంట్ గా లుక్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో రుక్మిణి వ‌సంత్ (rukmini vasanth) అన్ని ర‌కాలుగా స‌రితూగ‌డంతో ఆమెను ఫైన‌ల్ చేసిన‌ట్లు సమాచారం. దీంతో మ‌రోసారి తమ స్టేట్ కు చెందిన న‌టికే రిష‌బ్ శెట్టి ఛాన్స్ ఇచ్చినట్లయింది. ట్యాలెంట్ ని ప్రోత్సహించడంలో రిష‌బ్ శెట్టి ముందు వరుసలో ఉంటాడు. తన సినిమాలో ఉన్న వారంతా త‌న‌ వాళ్లే ఉంటార‌ని ఓ సంద‌ర్భంలో రిషబ్ చెప్పాడు.

నేచరల్ బ్యూటీ రుక్మిణి :

861ac4f1 c69d 407f b53f 620dfdfcfccb Kantara Prequel: కాంతార 2 లో కత్తిలాంటి హీరోయిన్

ఇక‌ కాంతార‌(Kantara )లో సప్తమీగౌడ (Saptami goud )రిషబ్ కి జోడీగా న‌టించింది. ఆమె కూడా కన్నడకు చెందిన బ్యూటీనే. కాంతార లో వీరిద్దరి కెమిస్ట్రీ ఎంత బాగా వర్క్ అవుట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు నేచుర‌ల్ బ్యూటీ తోనూ అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. రుక్మిణి వ‌సంత్ (rukmini vasanth) క‌న్న‌డ‌లో కొన్ని సినిమాలు చేసింది. అందులో స‌ప్త‌సాగ‌రాలు (Saptasagaralu )ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. కాంతార ఫ్రీక్వెల్ తో పాటు అమ్మడి చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. వాస్త‌వానికి స‌ప్త‌సాగ‌రాలు త‌ర్వాత అమ్మ‌డిని తెలుగులో లాంచ్ చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ కుద‌ర్లేదు. దీంతో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Leave a Comment