శివరాత్రి నాడు తప్పని సరిగా పాటించాల్సిన నియమాలు !

சிவலிங்கம் శివరాత్రి నాడు తప్పని సరిగా పాటించాల్సిన నియమాలు !


శివరాత్రి ని ఏ విధం గా చేసుకోవాలో గరుడ పురాణం లో చెప్పడం జరిగింది. అందరు విధిగా ఈ నియమాలను అనుసరించే శివరాత్రి పూజలు చేసుకోవాలి. పూజ చేస్సే ముందు ప్రతి ఒక్కరు మనసులో ఈ విధంగా అనుకోని పూజలు ప్రారంభించాలి. ” హే మహాదేవ, నేను చతుర్ధశి రోజున జాగరణ చేస్తాను, నా భక్తి , నా శక్తీ సామర్ధ్యాలను దృష్టి లో ఉంచుకుని దాన,తప , హోమాన్ని చేయగలను, నేను ఆరోజు నిరాహారి గా ఉండగలను, మర్నాడు మాత్రమే భుజించెదను, అందుకు నాకు కాలవలసిన శక్తి ని ప్రసాదించమని కోరాలి, అనంతరం ఆనంద, మొక్షాలను అనుగ్రహించు పరమేశ్వరా అని ఆ పరమేశ్వరడు కి మొక్కాలి.

పూజలు అనంతరం గురుగు వద్దకి వెళ్ళి వారి ఆశ్వీర్వచనం తీసుకోవాలి. అనంతరం పంచామృతాలు సిద్దం చేసుకోవాలి. పంచామృతాలు అంటే గోవు సంబందించిన వస్తువులు అంటే ఆవు పేడ – ఆవు పంచకం – ఆవు పాలు – ఆవు పెరుగు – ఆవు నెయ్యి వీటిని అన్ని కలిప పంచామృతాలు అంటారు. ఇప్పుడు ఈ పంచామృతాలు తో శివలింగాని కి అభిషేకం చెయ్యాలి. అభిషేకం చేస్తున్న సమయం లో మనస్సు లో ఓం నమః శివాయ అనుకుంటూ జపించాలి.

చందన లేపనం అంటే గంధం తో అభిషేకం ప్రారంభించి అన్ని ఉపాచారాలు తో శివ పూజ చెయ్యాలి. అగ్నిలో నువ్వులు,బియ్యము, నెయ్యి ఈ మూడింటిని కలిపి అన్నం గా చెయ్యాలి. ఈ హోమం అయ్యాక తప్పని సరిగా పూర్ణా హుతి నిర్వహించడం విధిగా చెయ్యాలి. పూజ అనంతరం శివుడు కి సంబదించిన కధలు కాని లీలలు కాని వినడం కానీ చదవడం కాని చెయ్యాలి. సూర్యోదయం అయ్యేవరకు మౌన వ్రతం పాటించాలి. మనస్సు లో శివుడిని ద్యానిచుకుంటూ ఉండాలి. అందుకు ఓం నమః శివాయ అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలి.

పూజలు పరిసమాప్తి అవ్వగానే ఆ పరమేశ్వరుడు ని ఈ విధం గా ధ్యానించుకోవాలి. ఓ పరమాత్మ ! మీ దయ వల్ల లేదా అనుగ్రంతో నిర్విఘ్నం గా పూజా ప్రారంభించి అలాగే పూర్తి చెయ్యగలిగాను. హే లోకేశ్వరా ! పరమేశ్వరా నన్ను క్షమించు – ఈ రోజున నేను ఆర్జించిన పుణ్య మంతా, మీకు అర్పితం చేసినదంతా మీ కృప తోనే పూర్తి చెయ్యగలిగాను. హే కృపానిధి ! మా పట్ల ప్రసన్నులు కండి ! మీ దర్శన భాగ్యము చేత మేము పవిత్రుల మయ్యాం అని ఆ పరమేశ్వరుడు కి అనేక నమస్కారాలు చెప్పుకోవాలి

Leave a Comment