Rumors On Sankranti Festival 2024: సంక్రాంతిపై సందేహాలెన్నో..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) హడావుడి మాములుగా ఉండదు. ఇంగ్లిష్ కాలెండర్ ప్రకారం చుస్తే ఈ సంక్రాంతి(Sankranti) తెలుగు వారికి వచ్చే మొదటి పండుగ,
అయితే తెలుగు వారు ఈ పండుగను ఎంతో వైభవంగా నిర్వహించుకునే పండుగ, ఇది రైతుల పండుగ, అచ్చమైన పల్లెటూళ్ళ పండుగ, అంతే కాదు ఇది పశువుల పండుగ కూడా.
అన్నిటికి మించి దీనిని కీడు పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ సమయంలో ప్రతి ఏటా ఏదో ఒక కీడు వస్తోందని, ఆ కీడును నివృత్తి చేసుకోవడానికి పరిహారాలు చేయాలనీ చెబుతూ ఉంటారు.
అయితే ఆ పరిహారాలు కూడా కొండను పిండి చేసేలాంటివేమీ కాదు, కేవలం బట్టలు పెట్టడం, లేదంటే గాజులు పెట్టడం, చీరలు రవికలు పెట్టడం వంటివే ఉంటాయి.
మరి ఈ ఏడాది ఏ కీడు రాబోతోంది ? దానికి పరిహారం ఏంటి ? అసలు ఇవి కేవలం పుకార్లేనా ? వీరికి పరిహారాలు పరిష్కారాలు అవసరం లేదా ? లేదంటే వాటిని తప్పక ఆచరించవలసిందేనా ?
సంక్రాంతి కీడు తెస్తుందా ? Does Sankranti bring harm?
సంక్రాంతిని ఒకపక్క పెద్ద పండుగ అని అంటూనే మరో పక్క దీనిని కీడు పండుగ అని కూడా అంటుంటారు. ఈ పండుగ వస్తూ వస్తూనే ప్రతి ఏడాది ఏదో ఒక కీడు తెచ్చి పెడుతుందని అంటుంటారు.
పైగా వాటికి పరిష్కారాలు కూడా చూపెడుతూ ఉంటారు. అయితే ఆ మాటలు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి ఎవరు వ్యాప్తి చేస్తున్నారు అన్నది పక్కన పెడితే ఎక్కువ మంది వాటిని ఆచరిస్తున్నారు.
ఇక సంక్రాంతి సమయంలో వచ్చే వదంతులు ఎలా ఉంటాయంటే ఆడపడుచుకి చీర పెట్టాలని, లేదంటే అన్న భార్యకి వెండి కుంకుమ భరిణలు ఇవ్వాలని,
ఒక్కోసారి ఆడపిల్లలు కన్నతల్లికి చీర పెట్టాలని, మరికొన్ని సార్లు ఆడపిల్ల కి తోడబుట్టిన వాడు చీర పెట్టాలని అంటూ ఉంటారు. ఇవి అనేకసార్లు అనేక సంక్రాతి సమయాల్లో వింటూ వచ్చాం.
ఈ సంక్రాంతి కి ఎం చేయాలి ? What To Do On Sankranti ?
తాజాగా సంక్రాంతికి వినిపిస్తున్న మాట ఏమిటి అంటే ఒకే ఒక్క కొడుకు ఉన్న తల్లి ఈ సంక్రాంతి(Sankranti) లోపు తొమ్మిది రకాల గాజులు వేసుకోవాలని,
అలా వేసుకుంటే ఆ తల్లికి కొడుకుకి ఇద్దరికీ క్షేమమని అంటున్నారు. అయితే ఇది ఏ పండితుల ద్వారా చెప్పబడింది అన్నదానిపై స్పష్టత మాత్రం లేదు.
ఈ ఆచారాలను ఎక్కువగా పల్లెటూళ్లలో ఆడవారు ఆచరిస్తుంటే, పట్టనాల్లో ని విద్యావంతులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు.
పైగా ఇది ఏ శాస్త్రంలో చెప్పబడింది, ఏ పండితులు చెప్పారు ? దేనిని ఆధారంగా చేసుకుని చెప్పారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో లాభం ఎవరిదీ ? Who benefits in this matter?
ఈ వ్యవహారాన్ని కొందరు మరో కోణం నుండి చూస్తున్నారు. ఇలాంటి ఆచారాలను పుట్టిస్తుంది దుకాణదారులేనని, ఒకరి నుండి మొదలు పెడితే అది మెల్లగా ఊరూరా,
వాడవాడలా వ్యాపిస్తోందని అంటున్నారు. దీని వల్ల దుకాణదారులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని చెబుతున్నారు. ఈ సంక్రాంతి విషయాన్నే తీసుకుంటే,
గాజులు వేసుకుంటే మంచిదని అంటున్నారు, అయితే 9 రంగుల గాజులు మాత్రమే ఎందుకు వేసుకోవాలి ? ఏ సమయంలో వేసుకోవాలి అన్నదానిపై పూర్తి క్లారిటీ లేదు.
గడిచిన సంక్రాంతి సమయంలో చుస్తే కొన్ని సార్లు చీరాల పెట్టాలని వార్తలు వచ్చాయి. దాని వల్ల సారి సెంటర్స్ గళ్ళ పెట్టె బాగానే నిండింది.
అసలేం చేయాలి ? What should be done?
వీటన్నిటిని బట్టి చుస్తే ఆచార వ్యవహారాలు అనుసరించడం తప్పకుండా అవసరమే, అయితే ఎవరు పడితే వారు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా,
మనకి నమ్మకంగా ఉండే పండితుడిని సలహా అడిగి ఆచరించడం ఉత్తమం అంటున్నారు శాస్త్రం తెలిసిన నిపుణులు.
ప్రతిదానిని కొట్టిపారేయకుండా అనుసరించాల్సిన వాటిని అనుసరిస్తే పొంచి ఉన్న కీడుని తొలగించుకుని సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది.