Rumours New Film a love story: ఉన్న పరిస్థితుల్లో ప్రేమ కథను తెరకెక్కించాలంటే దర్శకుడికి అగ్ని పరీక్ష అని చెప్పాలి.

ezgif 4 69a767c427 Rumours New Film a love story: ఉన్న పరిస్థితుల్లో ప్రేమ కథను తెరకెక్కించాలంటే దర్శకుడికి అగ్ని పరీక్ష అని చెప్పాలి.

Rumours New Film a love story: ఉన్న పరిస్థితుల్లో ప్రేమ కథను తెరకెక్కించాలంటే దర్శకుడికి అగ్ని పరీక్ష అని చెప్పాలి.

ఎందుకంటే అప్పటి దేవదాస్ నుండి ఇప్పటి వరకు చాల మంది ప్రేమ సినిమాగా తీసి ఆ కథను పిండి పిప్పి చేశారు. కాబట్టి ఎంతో కొత్త దనం చూపెడితే తప్ప నవతరం ప్రేక్షకులకు ఎక్కదు.

మరి అలా నిన్ను చేరి అంటూ ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ లవ్, ఫ్యామిలీ, ఎంటర్టైనర్ ఎలా ఉందొ చూద్దాం.

ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరోది విశాఖపట్టణం దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరు. కథ కూడా ఇప్పటిది కాదు, కాయిన్ బాక్సుల కలం నాటిది, సినిమాలోని కొన్ని సీన్లలో ఎక్కడ మనకు సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోనులు కనిపించవు.

ఫస్ట్ హాఫ్ ఎక్కువగా విలేజ్ బ్యాక్ డ్రోన్ లో సాగుతుంది. హీరో దినేష్ తేజ్‌ గణేష్ అనే పల్లెటూరి కుర్రాడి పాత్ర పోషించాడు. అదే ఊరిలో ఉండే దివ్య‌ పాత్రను పాయల్ రాధాకృష్ణ పోషించింది.

ఝాన్సీ ఆమె తల్లిగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోకి డైరెక్టర్ అవ్వాలని కోరిక, హీరో హీరోయిన్ గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ వారి పెళ్ళికి నాయిక తల్లి అస్సలు ఒప్పుకోదు. తనని కాళీ అనే వ్యక్తికీ ఇచ్చి పెళ్లి చేయాలనీ అనుకుంటుంది.

అయితే తన తల్లి తీసుకున్న నిర్ణయాన్ని హీరో కి చెప్పినప్పటికీ హీరోయిన్ మాటలు హీరో ఏమాత్రం పట్టించుకోడు. కెరియర్ లో స్థిరపడి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని హైదరాబాద్ వెళ్ళిపోతాడు.

అక్కడే హీరోకి అను అనే అమ్మాయి పనిచయం అవుతుంది. అన్నట్టు అను అనే మోడ్రన్ అమ్మాయి క్యారెక్టర్ ను హెబ్బా పటేల్ పోషించింది.

మరి ఈ సినిమాలో నాయికా దివ్యకు కాళీ తో పెళ్లయిందా, హీరో గణేష్ తో పెళ్లయిందా, అను కి గనేష్ కి ఎలాంటి సంబంధం ఉంది. గణేష్ డైరెక్టర్ అవ్వగలిగాడా? ఇలాంటి డీటైల్స్ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో స్వచ్ఛమైన పల్లెటూరి అందాలను చూపెట్టిన డైరెక్టర్ లవ్ స్టోరీని మాత్రం పూర్తి స్థాయిలో రక్తి కట్టించలేకపోయాడు. ప్రేమకథలో ఎక్కడో కొద్దిగా మిస్ అయినట్టు అనిపిస్తుంది.

అప్‌క‌మింగ్ డైరెక్ట‌ర్ల‌కు ఇండ‌స్ట్రీలో ఎలాంటి ప‌రిస్థితులు ఎదురువుతాయ‌న్న‌ది చూపించడంలో సక్సస్ అయ్యాడు. సినిమా చాలా చోట్ల నెమ్మదిగా సాగుతుంది.


ఒక వైపు లక్ష్యం మరోవైపు ప్రేమ ఈ రెండిటి సంఘర్షణలో నలిగిపోయే క్యారెక్టర్ లో హీరో బాగా నటించాడు, కానీ ఆ సీన్లను ఇంకాస్త డెప్త్ తో తీసి ఉంటె బాగుండేది అని చుసిన వారి భావన.

నటనలో తన అనుభవాన్ని హెబ్బా పటేల్ చక్కగా చూపెట్టింది. పల్లెటూరి అమ్మాయిగా పాయల్ ఆకట్టుకుంది. మొత్తానికి మీకు తీరిక ఉంటె ఈ సినిమాను చూడొచ్చు, అంతే కానీ పనికట్టుకుని వెళ్లి మరీ చూడాలనేంత హృద్యమైన ప్రేమకథ మాత్రం కాదు.

నటీనటులు : దినేష్ తేజ్‌, హెబ్బా పటేల్, పాయల్ రాధా కృష్ణ, ఝాన్సీ, షకలక శంకర్, శ‌త్రు, మహేష్ ఆచంట
దర్శకత్వం : మహేష్ శివన్, సినిమాటోగ్రఫీ : ఆండ్రూ, సంగీతం : సుభాష్ ఆనంద్

Leave a Comment