Saindhav Movie Ticket Price: సైంధవ్ సినిమా టికెట్ రేటు ఎంత పెరిగిందంటే

Saindhav Movie Ticket Price

saindhav movie ticket price: ఇటు తెలంగాణ(Telangana), అటు ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాయి, తెలంగాణ లోని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కారు అదనపు షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే థియేటర్లు దక్కించుకోవడం అనేది నిర్మాత మీద ఆధారపడి ఉంటుంది.

ఇక తెలంగాణ లో టికెట్ ధరలు చుస్తే సైంధవ్ సినిమా కోసం అత్యధికంగా 175 రూపాయలు టికెట్ ధర ఉండనుంది. ఇక అక్కడి నుండి దిగువకు అంటే సింగల్ స్క్రీన్ థియేటర్లను బట్టి ఉంటుంది. కొన్ని థియేటర్లలో 50 రూపాయలకే టికెట్ లభిస్తోంది.

మరి మల్టీప్లెక్సుల విషయానికి వస్తే టికెట్ రేటు 295 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలవ్వనే లేదు.

Saindhav Movie Ticket Price

విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన తాజా చిత్రం సైంధవ్(Saindhav). ఈ సినిమా కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వెంకటేష్ నటించిన 75వ సినిమా. శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ త్రిల్లర్ జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఈ సినిమా లో ఫిమేల్ లీడ్ లో శ్రద్ధ శ్రీనాథ్(SradhaSrinath), రుహాని శర్మ(Ruhani Sharma) నటించారు. మరో ముఖ్య పాత్రలో ఆండ్రియా జామేరియా(Andriya Jameria) నటించింది. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి(navajuddin Sidhikhi) ని తీసుకున్నారు.

ఇది తొలి తెలుగు సినిమా. ఈ సినిమా లో తమిళ నటుడు ఆర్య (Arya) మరో కీలక పాత్రను పోషించాడు. సంతోష్ నారాయణ్(Santosh Narayan) సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించాడు.

2024 లో వెంకీ బోణి కొడుతున్నాడు : Venky Starts 2024 With Saindhav

Saindhav Movie Ticket Price

ఇక 2023 లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయని వెంకీ 2024 లో సైంధవ్(Saindhav) తో ఫాన్స్ ను తెలుగు ఆడియన్స్ ను పలుకరించబోతున్నారు. వెంకటేష్ అంట ఫ్యామిలీ ఆడియన్స్ హీరో, స్టార్ హీరో అయినప్పటికీ హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాల్లో కూడా నటించారు.

అందుకు ఉదాహరణగా రాజా, పెళ్లి చేసుకుందాం(Pellichesukundam), పవిత్ర బంధం(Pavitrabandham) సినిమాలను చెప్పొచ్చు అయితే ఈ సంక్రాంతికి మాత్రం వెంకీ యాక్షన్ సినిమా తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. వెంకీ కేవలం లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు, మంచి యాక్షన్ సినిమాలు కూడా చేసి మెప్పించారు.

ప్రేమించుకుందాం రా(Preminchukundam Raa) , గణేష్(Ganesh), ఘర్షణ(Gharshana) సినిమాలు చెప్పుకోవచ్చు. అయితే వెంకీ సంక్రాంతికి వస్తున్నాడంటే అయన ఫాన్స్ చాలా ఆతృతగా ఎదురు చుస్తుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేసిన వారం రోజుల్లోనే పెట్టుబడి, లాభాలు రాబట్టుకోవాలి, అంటే అందుకు కావలిసింది ఎక్కువ థియేటర్లు, సినిమా షోల పెంపు, అలాగే టికెట్ రేట్ల పెంపు.

Leave a Comment