Saindhav Twitter Review: తండ్రి కూతురి సెంటిమెంట్‌తో రూపొందిన మూవీ సైంధవ్ (Saindhav). సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) సినీ కెరీర్లో వచ్చిన 75వ మూవీ సైంధవ్ . శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
మరి సైంధవ్ తో వెంకటేష్ హిట్ కొట్టినట్లేనా? తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లేనే? ప్రేక్షకుల ఫీలింగ్స్ ఏంటి? సినిమాపై ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Saindhav casting : సైంధవ్ కాస్టింగ్
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ (Niharika Entertainments) బ్యానర్ పై డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) రూపొందించిన మూవీ సైంధవ్.
ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ (Venkatesh)కు జోడీగా శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath)నటించింది. ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ నటుడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) కనిపించారు.
వీరితో పాటు తమిళ హీరో ఆర్య (Aarya), ఆండ్రియా (Andriya), రుహానీ శర్మ (Ruhani Sharma) కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ (Santosh Narayan)సైంధవ్ కి సంగీతం అందించారు.
Venkatesh impressed with his performance : నటనతో అదరగొట్టిన వెంకటేష్
సైంధవ్ లో వెంకీ (Venkatesh) నటన ప్రేక్షకులను అలరిస్తుందని, ముఖ్యంగా మూవీలోని ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తాయని, పేరెంట్స్‌ని ఈ మూవీ కట్టి పడేస్తుందని మేకర్స్ సినిమా రిలీజుకు ముందే ప్రమోషన్లలో భాగంగా అనౌన్స్ చేశారు.
వారు తెలిపినట్లే వెంకటేష్ తన యాక్టింగ్ తో దుమ్ముదులిపారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) తనదైన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడు. ఈ సినిమాకు వీరిద్దరే ప్లస్ పాయింట్ అని ప్రేక్షకులు అంటున్నారు.
సినిమా ఫుల్ వయలెన్స్ ఉందని వెంకీ భయపెట్టేశాడని రివ్యూ ఇస్తున్నారు. ఇక సినిమాలోని ఆర్ఆర్, బీజీఎం అదిరిపోయాయ్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సైంధవ్ లో యాక్షన్ సీన్స్ తో పాటు భావోద్వేగమైన సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.
క్లైమాక్స్ సీన్ చూసి ఏడ్చేశామని ప్రేక్షకులు చెబుతున్నారు. డైరెక్టర్ సినిమా ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమా తీశాడని శైలేష్ (Sailesh Kolanu)కు ఆడియన్స్ ప్లస్ పాయింట్స్ ఇచ్చారు.
Saindhav Twitter Talk : సైంధవ్ ట్విట్టర్ టాక్
భావోద్వేగంతో నడిచే కథ సైంధవ్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. పాటలు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి.
వెంకీ మామ ఇంటెన్స్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మిగిలినదంతా యావరేజ్ స్టఫ్ అని పీటర్ రివ్యూస్ తన ట్విట్టర్ వేదికగా సైంధవ్పై రివ్యూ ఇచ్చాడు.
సైంధవ్ మూవీ బాగుంది. నవాజుద్దీన్ నటన బాగుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ లో వెంకీ మామ యాక్టింగ్ అదిరిపోయింది. ఈ సినిమా చూసినంతసేపు నిజంగా మంచి అనుభూతి కలిగింది. థియేట్రికల్ అనుభూతి కోసం ఒకసారి సినిమాను చూడొచ్చు.
ఈ సినిమా నుంచి చాలా ఎక్కువగా ఆశించాను, అయినప్పటికీ సినిమా చూసినంత సేపు ఎక్కడా కూడా బోర్ కొట్టలేదని తాట తీస్తా అనే రివ్యూయర్ మూవీపై తన అభిప్రాయాన్ని తెలిపాడు.