Shruti Haasan: సలార్ బ్యూటీ చీర సొగసులు అదుర్స్.

Salar Beauty sarees are beautiful.

Shruti Haasan: సలార్ బ్యూటీ చీర సొగసులు అదుర్స్.

Film Industry లో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే వర్తిస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Kollywood స్టార్ హీరో Kamal Haasan కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో film industry లోకి అడుగుపెట్టిన Shruthi Haasan మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. చాన్నాళ్లు శృతికి చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవడంతో ఆమెను ఘోరంగా troll చేశారు.

అయినా Shruthi Haasan అలాంటివి ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. పవర్ స్టార్ Pawan Kalyan నటించిన Gabbarsingh బ్లాక్ బస్టర్ హిట్ తో అమ్మడి జాతకం ఒక్కసారిగా మారిపోయింది.

ఆ సినిమా అనంతరం చేసిన Cinema లు కూడా దాదాపు హిట్లు కావడంతో Top Heroine స్థాయికి చేరుకుంది. కుర్ర హీరోలతోనే కాదు సీనియర్ స్టార్స్ కు ఈ అమ్మడు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా మారిందనే చెప్పాలి.

రీసెంట్ గా ఈ భామ Tollywood సీనియర్ యాక్టర్లు Chiranjeevi , Balakrishna లతో నటించి అరుదైన రికార్డ్ సృష్టించింది. తన తండ్రి వయసుకు సమాన హీరోలతో నటించడం Shruthi Haasan కు మాత్రమే చెల్లింది.

Tollywood లో నెంబర్ వన్ Heroine గా ఒక వెలుగు వెలిగిన Shruthi Haasan కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. Tollywood లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తోంది.

ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా ఈ భామ Salaarలో నటించి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. Salaar సినిమా ఈ నెల 22 న వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది.

Pan India మూవీగా ఇప్పటికీ భారీ వసూళ్లతో దుమ్ము దులుపుతోంది. ఓవైపు వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తూనే
Shruthi Haasan తన అందాల ప్రదర్శనతో Social mediaలో హీట్ పెంచుతోంది.

తాజాగా ఈ చిన్నదినలుపు రంగు చీర కట్టుకుని అద్భుతమైన Photo shoot చేసింది . ఆ ఫోటో షూట్‏లోని పిక్స్‎ను తన Instagram లో షేర్ చేసింది ఈ బ్యూటీ. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం Shruthi Haasan వేసుకున్న ఈ Black Sareeని Arpitha Mehtha ఫ్యాషన్ హౌజ్ నుంచి ఎన్నుకుంది.

హెవీ embroidary border కలిగిన ప్లేయిన్ black Saree ని కట్టుకుని క్లోస్డ్ నెక్‏లైన్, బ్యాక్ ఓపెన్ ఉన్న designer blouse ని ఈ చీరకు జోడించింది Shruthi Haasan .

ప్రముఖ స్టైలిస్ట్ హౌస్ open house studio, Shruthi Haasanకి స్టైలిష్ లుక్స్ అందించింది. మేకప్ ఆర్టిస్ట్ దేవిక జోదాని శృతి అందాలకు మెరుగులు దిద్దింది.

ఈ చీరకు తగ్గట్లుగా శృతి స్టైలిష్ ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుంది. ఈ లుక్ లో Shruthi Haasan అందరి మైండ్ బ్లాక్ చేసింది. తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.

అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఆ లక్ వచ్చినప్పుడు మాత్రం సద్వినియోగం చేసుకోవడమే మన చేతుల్లో ఉన్న పని.

ప్రస్తుతం నటి Shruthi Haasan పరిస్థితి కూడా ఇదే. సెన్సేషనల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరైన శృతి చేతుల్లో మొన్నటి వరకూ salaar అనే ఒకే ఒక్క మూవీ మాత్రమే చేతిలో ఉండేది.

కానీ salaar సూపర్ హిట్ తో అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీTeluguలో adavi shesh మూవీలో నటిస్తోంది . ఇక తాజాగా మరో పాన్‌ ఇండియా మూవీలో అమ్మడు నటిగా ఛాన్స్ కొట్టేసిందట.

ఇదిలా రీసెంట్ గా Shruthi Haasan పెళ్లి పై నెట్టింట్లో రూమర్స్ వస్తున్నాయి. దీనితో తాజాగా Shruthi Haasan పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

తనపై వస్తున్న పుకార్ల పైన స్పందిస్తూ, తన instagram లో Shruthi Haasan ఇలా రాసింది, “నాకు పెళ్లి కాలేదు. ప్రతి విషయం గురించి బహిరంగంగా చెప్పే నేను, పెళ్లి విషయం ఎందుకు దాస్తాను? అని” తనకి marriage కాలేదని క్లారిటీ ఇచ్చేసింది.

Leave a Comment