Salaar: RRR ని ఆ ఒక్క విషయంలో బీట్ చేయలేకపోయిన సలార్.
కలెక్షన్లలో భారీ భారీ సినిమాతో ఢీకొని , అన్నింటినీ వెనక్కి నెట్టి ముందంజలో నిలబడింది.
తొలి రోజే 170 కోట్లకి పైగా కొల్లగొట్టి భారీ ఓపెనింగ్ గా రికార్డు సృష్టించింది.
ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటో నిరూపించింది.ఇది అసలు ప్రభాస్ కట్ అవుట్ కి దగ్గ సినిమా అంటున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే, ఇన్ని రికార్డుల ప్రభంజనం సృష్టించిన SALAAR, ఒక్క విషయంలో మాత్రం RRR ని బీట్ చేయలేకపోయింది.
RRR ని బీట్ చేయలేకపోయిన SALAAR :
భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న SALAAR నైజాం కలెక్షన్ల విషయంలో మాత్రం RRR ని బీట్ చేయలేకపోయింది.
RRR సినిమా నైజాంలో దాదాపు రూ. 23 కోట్ల 35లక్షల రూపాయలు వసూల్లు రాబట్టింది.
కానీ ఇంత పెద్ద విజయం సాధించిన సలార్ మాత్రం రూ. 22 కోట్ల 55 లక్షలు వసూలు చేసింది.చాలా కొద్ది తక్కువ మార్క్ తో SALAAR, RRR ని బీట్ చేయలేకపోయింది.