Salar Movie Update : సాలార్ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన డర్టీ హరి హీరోయిన్.రామోజీ ఫిలిం సిటీలో సాలార్ మూవీ ఐటెం సాంగ్.
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం సాలార్, ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే సెప్టెంబర్ లో విడుదల కావలసిన ఈ సినిమా మరింత ఆలస్యం కావడంతో వారి ఎదురు చూపులు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఇటలీ నుండి తిరిగి వచ్చిన ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పగానే వారికి పండగలాంటి సంబరాన్ని తెచ్చించి.
అంతే కాదు ఈ సినిమా లో వి ఎఫ్ ఎక్స్ పనుల నిమిత్తమే ఆలస్యమైందని. వాటిని మరింత పకడ్బందీగా రూపొందించామని చెప్పడంతో సినిమాపై హైప్ మరింత ఎక్కువైంది.
పైగా ఈ సినిమాలో రెండు పాటలు పిక్చరైజ్ చేయాల్సి ఉందని కూడా మేకర్ల ద్వారా తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఒక పాట కోసం డర్టీ హరి ఫేమ్ సిమ్రత్ కౌర్ ను ఎంపిక చేశారట. ఆ భామ కూడా సాలార్ లో ఐటెం సాంగ్ అనగానే ఎగిరిగంతేసినంత పని చేసి ఒప్పుకుందని తెలుస్తోంది.
ఈ పాటను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో తెరకెక్కిస్తున్నారట. అయితే ఇందులో సిమ్రత్ కౌర్ తో కలిసి ప్రభాస్ స్టెప్పులేమైనా వేస్తాడా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు.
ఫాన్స్ మాత్రం ప్రభాస్ బాహుబలి లో మనోహరి అంటూ సాగిన సాంగ్ మాదిరిగా ఐటెం భామతో రొమాన్స్ చేస్తుంటే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇక సిమ్రత్ కౌర్ పెద్దగా ఫేమ్ లేని హీరోయిన్ కదా ఆమెకు ఎందుకు డార్లింగ్ పక్కన అవకాశం ఇచ్చారు అని డౌట్ అక్కర్లేదు.
చక్రాల్లాంటి కళ్లున్న ఈ అమ్మడు ఈ మధ్య బాలీవుడ్ లో విడుదలైన గదర్ 2 లో నటించి మెప్పించింది. కాబట్టి ఆ ఫెమ్ ను దృష్టిలో పెట్టుకునే ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయినా స్టార్ హీరోల సినిమాల్లో నటించడం ఈ అమ్మడుకి కొత్తేమి కాదు నాగార్జున హీరోగా వచ్చిన బంగారు రాజు లో ఒక చిన్న క్యారెక్టర్ చేసింది.