Salaar Movie: ప్రభాస్ ఎంట్రీ పై సలార్ నిర్మాత క్లారిటీ !
సాలార్ .. ఈ డిసెంబర్ 22 కోసం ఎన్నో నెలలుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమనులంతా ఎదురుచూస్తున్నరోజు ఇది.
వరుసగా వస్తున్న ఫ్లాప్ లను తట్టుకుంటూ, భారీ ప్రాజెక్టులు తీసుకొని ఫలితం గురించి పక్కన పెట్టి ఒక్క సినిమా కోసం ఏళ్ళకు ఏళ్లు కస్టపడే వ్యక్తి ప్రభాస్. ఎన్ని పరాజయాలు అతన్ని తాకిన, అభిమానుల ప్రేమలో కొంచెం కూడా మార్పు లేదు, బహుశా ఇదే అతన్ని నడిపిస్తుందేమో.
తాజాగా విడుదలైన ఆది పురుష్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు ఆర్దికంగా గెలిపించారు, అంతకు ముందు వచ్చిన సినిమా సాహో, ఇది హిట్ కి దరిదాపులకి కూడా చేరుకోలేకపోయింది,
అయినప్పటికీ ప్రభాస్ చేసే సినిమాలపై అభిమానుల అంచనాలు కొంచెం కూడా తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి తరువాత చెప్పుకోదగ్గ ఒక్క సినిమా కూడా ప్రభాస్ జాబితాలో లేదు.
అయితే ఇప్పుడు రాబోతున్న సలార్ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు, ఈ సినిమా మంచి హిట్టవుతుందన్న ఆశతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల వచ్చిన సలార్ ట్రైలర్, అన్నీ సినిమాల ట్రైలర్ లకు భిన్నంగా 3 నిముషాలకి కాస్త ఎక్కువే ఉంది.పైగా ఆ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
ఈ ఒక్క ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలని మరింత పెంచిది. అయితే ఈ ట్రైలర్ లో ఒక నిమీషం గడిచాక గాని హీరో ప్రభాస్ ఎంట్రీ ఎక్కడా కనిపించలేదు. దానితో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ చెందారు.
సినిమాలో కూడా ప్రభాస్ ఎంట్రీ లేట్ గానే ఉంటుందేమొనని ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయం పట్ల నిర్మాత విజయ్ ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చారు అదేంటంటే, ” ట్రైలర్ లో లాగా సినిమాలో ప్రభాస్ ఏంటి ఆలస్యం అవదు” అని వివరించారు.
ఇక ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, కెజిఎఫ్, కెజిఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన సలార్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సలార్ లో ప్రభాస్, శృతిహాసన్, పృథ్వీరాజ్, సుకుమారన్, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు.
ఈ డిసెంబర్ 22వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.