Salaar ‘Sooreede’: ‘సలార్’ రేంజ్..మొదటి పాట ‘సూరీడే’ఎట్లుందంటే.

Add a heading 2023 12 14T102255.627 Salaar 'Sooreede': 'సలార్' రేంజ్..మొదటి పాట 'సూరీడే'ఎట్లుందంటే.

Salaar ‘Sooreede’ : ఇది ‘సలార్’ రేంజ్.. మొదటి పాట ‘సూరీడే’ఎట్లుందంటే.

మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ప్రమోషన్ల జోరు మొదలైంది. డిసెంబర్ 22న ఈ మూవీ రిలీజ్ ఉండటంతో మేకర్స్ హైప్ తీసుకొచ్చే ప్రయత్నంలో మునిగిపోయారు.

విడుదల తేదీ దగ్గర పడుతున్నా..ప్రమోషన్ల మాటే లేదని నిన్న మొన్నటివరకు అందరూ అనుకున్నారు కానీ, సలార్ తోటి మామూలుగా ఉండదని నిరూపించారు మేకర్స్.

రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచిన సినిమా యూనిట్ ఇప్పుడు సలార్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేసి ఫాన్స్ ను థ్రిల్ చేశారు.

ప్రమోషన్ లో భాగంగా సూరీడే అనే మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ను చూపించే పాట ఇది.

ఈ సాంగ్ లో మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా చూపించారు. ప్రభాస్, పృథ్వీరాజ్ లకు సీనియర్ నటి ఈశ్వరి రావు తల్లిగా నటించినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరికి అన్నం తినిపించడం ఈ పటలో చూడవచ్చు.

పృథ్వీరాజ్, ప్రభాస్ పెద్దయ్యాక ఉలిక్కిపడి పృథ్వీరాజ్ లేచినప్పుడు ‘నేనున్నాను కదరా… పడుకో’ అని ప్రభాస్ డైలాగ్ కూడా ఉంది. ప్రభాస్ ఒళ్లో పృథ్వీరాజ్ పడుకోవడ వంటి సీన్స్ చూడవచ్చు.

ఈ పాట ట్యూన్ ‘కేజీయఫ్’ తరహాలోనే ఇన్‌స్ట్రుమెంటేషన్‌లా అనిపించింది. అయినప్పటికీ పాట చాలా క్యాచీగా ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ కూడా కేజీఎఫ్ మూవీలా అనిపించాయి. ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రల మధ్య కెమిస్ట్రీ చుట్టూనే ఈ సాంగ్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

‘సలార్’ మూవీ హెవీ కాంపిటీషన్ మధ్య విడుదల అవుతోంది. సలార్ రిలీజ్ రోజే షారుక్ ఖాన్ నటించిన ‘డంకీ’ తో పాటు హాలీవుడ్ మూవీ ‘ఆక్వామేన్: ది లాస్ట్ కింగ్‌డం’ రిలీజ్ కాబోతున్నాయి.

ఇందులో రాజ్ కుమార్ హిరానీ తీసిన ఎమోషనల్ డ్రామా ‘డంకీ’ థియేటర్లలో సలార్ కు గట్టి పోటీ ఇస్తుందని టాక్ వినిపిస్తోంది. దీనితో ‘సలార్’కు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వస్తాయా లేదా అన్నదానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో ‘సలార్’ ప్రొడ్యూసర్ విజయ్‌ కిరగందూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సలార్ రిలీజ్ ను ఒక సిస్టమ్ ప్రకారం చేస్తున్నట్లు తెలిపారు.

“బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని సినిమాలు బరిలో నిలిచినా ‘సలార్’ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. గత దశాబ్దకాలంగా చిత్రాలను ఒక పద్దతిలో రిలీజ్ చేస్తున్నాం.

‘సలార్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఆలస్యం కారణంగానే మొదటిసారి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది.. సలార్ విడుదల రోజే డంకీ, ఆక్వామేన్: ది లాస్ట్ కింగ్‌డం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

అయినా మేం రిలీజ్ డేట్ మార్చాలి అనుకోలేదు. ఈ మధ్య ప్రభాస్‌ చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

అలా అని ముందు సినిమాలతో ఒక నిర్మాతగా నేను ఈ సినిమాను పోల్చి చూడలేను. సినిమాకు కథనే ప్రాణం. అది సలార్ లో ఉంది. ‘సలార్‌’ కనీవినీ ఎరుగని సక్సెస్ ను అందుకుంటుంది.

నేను గట్టిగా ఈ విషయాన్నీ నమ్ముతున్నాను. ప్రభాస్‌ సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమాకు కూడా కచ్చితంగా అలాగే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది” అని విజయ్‌ కిరగందూర్‌ తెలిపారు.

Leave a Comment