Salman and Sandeep reddy vanga movie together ? యానిమల్ Animal సినిమాతో బాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga).
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించిన ఈ మూవీతో బాలీవుడ్ లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు సందీప్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor),నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ల కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ రూ.
900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక సందీప్ ఇదే జోష్ లో యానిమల్ పార్క్ (Animal Park) ను మరింత ఎఫెక్టివ్ గా చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు. ఈ క్రమంలోనే యానిమల్ తర్వాత సందీప్ బాలీవుడ్ లో ఎవరితో సినిమా చేస్తున్నాడు అన్నదానిపై బీ టౌన్ లో పెద్ద చర్చ జరుగుతోంది.
అయితే ఈ యువ దర్శకుడి తో సల్మాన్ ఖాన్ (Salman Khan)తన నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నాడని తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సల్మాన్ కోసం సందీప్ ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో మరోసారి యానిమల్ డైరెక్టర్ ట్రెండింగ్ లోకి వచ్చాడు.
Will Sundeep do movie with Salman ? : సల్మాన్‌తో సందీప్ సినిమా ఉంటుందా?
‘యానిమల్’ (Animal )విజయం తర్వాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga)ప్రస్తుతం ప్రభాస్ (Prabha) ,అల్లు అర్జున్ (Allu Arjun)లతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Sharukh Khan)లతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో తాజాగా సందీప్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)తో మూవీ సైన్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీంతో సందీప్ రెడ్డి జాక్‌పాట్ కొట్టాడంటూ సల్మాన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అంతే కాదు త్వరలో టైటిల్‌తో పాటు మరిన్ని అప్డేట్స్ వస్తాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ న్యూస్ కేవలం రూమర్ మాత్రమే అంటూ కొంత మంది నెటిజన్స్ కొట్టిపారేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సందీప్ రెడ్డి వంగాతో ఇప్పటి వరకు ఏ కథ గురించి చర్చించలేదని, అసలు సల్మాన్ ఇప్పటి వరకు ఏ కొత్త మూవీకీ సైన్ చేయలేదని తెలుస్తోంది.
ఇదంతా ఫేక్ న్యూస్ అని బీ టౌన్ కొట్టేస్తోంది. ప్రస్తుతం సల్మాన్ బుల్ (Bull)మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తైన తర్వాత సల్మాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటిస్తాడు. అయితే మరి సల్మాన్‌తో సందీప్ సినిమా ఉంటుందా? అంటే మాత్రం వేచి చూడాల్సిందే.
Animal Park will be bigger and crazier : యానిమల్ పార్క్ భారీగా మరియు క్రేజీగా ఉంటుంది
ఇటీవల టైమ్స్‌నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వంగ మాట్లాడుతూ..”యానిమల్ సీక్వెల్ భారీగా, క్రేజీగా’ ఉంటుంది.
ఈ సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) క్యారెక్టర్ మరింత వైలెంట్ గా బోల్డ్ గా ఉంటుంది. ఘాటైన సీన్స్ తో పాటు క్రూరమైన యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల అంచనాలను మించి ఈ సినిమా ఉంటుంది”అని యానిమల్ పార్క్ (Animal Park) గురించి అప్ డేట్స్ అందించాడు సందీప్.
ఈ కామెంట్స్ తో ప్రేక్షకులలో యానిమల్ పార్క్ పైన అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.