Samantha hot look: హీట్ పెంచుతున్న సామ్..డెనిమ్ డ్రెస్ లో అందాలు వావ్.

Sam is turning up the heat..Wow the beauty in the denim dress.

Samantha hot look: హీట్ పెంచుతున్న సామ్..డెనిమ్ డ్రెస్ లో అందాలు వావ్.

స్టార్ హీరోయిన్, సమంతా రూత్ ప్రభు కేవలం నటి మాత్రమే కాదు, అద్భుతమైన ఫ్యాషన్ ప్రియురాలు. సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైన ప్రతిసారి తనదైన స్టైలిష్ అవుట్ ఫిట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ భామ అప్పుడప్పుడు ప్రముఖ బ్రాండ్లకు ఫ్యాషన్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది.

అంతేకాదు దుస్తుల బ్రాండ్ సాకి ఏకమ్ ప్రీ-స్కూల్ బిజినెస్ వంటి వ్యాపారాలను కూడా నిర్వహిస్తుంది. వీటితో పాటే ఈ బ్యూటీ ఇప్పటికే సామ్ జామ్ వంటి షోలను, పలు సెలబ్రిటీ ఇంటర్వ్యూలను హోస్ట్ చేసింది.

ఈ క్రమంలో సమంత ఇప్పుడుతాజాగా కొత్త ఉద్యోగం చేస్తోంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఒక్కసారిగా టీవీ స్క్రీన్ మీద తలుక్కుమంది. తన ఫ్యాన్స్ ను ఫిదా చేసేసింది.

సమంత మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో పోరాడుతున్న కారణంగా సినిమాలకు విరామం తీసుకున్నప్పటికీ, ఆమె ఇప్పుడు ఒక రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. రియాలిటీ షో MTV హస్టిల్, రాబోయే ఎపిసోడ్‌లో సమంత మెరిసింది.

కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా ఉన్న పాప్ స్టార్ బాద్‌షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో, వేదికపై నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ అదిరిపోయే డ్రెస్ లో కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది సమంత. ఈ డ్రెస్ లో సమంత అందరిని మెస్మరైజ్ చేసేసింది.

ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమెను జడ్జిగా చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

సమంత లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి . తాజా ఫోటో షూట్ కోసం సామ్ చాలా బోల్డ్ పోజులు ఇచ్చి మైండ్ బ్లాక్ చేసింది. రియాలిటీ షో MTV హస్టిల్ న్యూ సీజన్‌ను షురూ అయిన సందర్భంగా ప్రోమోను కూడా షేర్ చేసింది సామ్. ఈ పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.

సమంత డిజైనర్ బ్లూ జీన్స్ లో బోల్డ్ గా ఫోటోలను దిగింది. లేటెస్ట్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
సమంత లేటెస్ట్ ఫోటోలకు నెట్టింట్లో లైకుల వర్షం కురుస్తోంది.

నెటిజన్స్ సమంత అందాలను పొగడ్తలతో ముంచేస్తున్నారు. సమంత రీసెంట్ గా టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసింది. ఈ మూవీ మంచి హిట్ సాధించింది. ఆ మూవీ తర్వాత ఇప్పుడే కొత్తరకంగా కొత్త ఫోటోషూట్ తో మెరిసిపోయింది సమంత.

Add a heading 2023 12 11T150551.029 Samantha hot look: హీట్ పెంచుతున్న సామ్..డెనిమ్ డ్రెస్ లో అందాలు వావ్.

సమంత ఫ్యామిలీ మెన్ 2తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి కలిసి సమంత నటిస్తోంది.

ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. అంతే కాదు త్వరలో సమంత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఆమె నటిస్తున్నట్లు నెట్టింట్లో న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డైరెక్టర్ విష్ణువర్ధన్ తెరకెక్కిస్తున్న మూవీ లో సమంత హీరోయిన్ గా ఎంపికైంది. ఈ క్రమంలో సామ్ తన అభిమానులకు తాజా ఫోటోలను షేర్ చేస్తూ ట్రీట్ ఇచ్చేసింది.

Leave a Comment