డివోర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ ..ఒకే ఈవెంట్‌లో సమంత ,చైతన్య

4649694568 డివోర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ ..ఒకే ఈవెంట్‌లో సమంత ,చైతన్య

Samantha and Nagachaitanya share same stage for the first time after divorce : ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుపొందిని సమంత (Samantha)నాగచైతన్య (Nagachaitanya)విడాకులు తీసుకుని రెండేళ్లపైనే అయ్యింది.

డివోర్స్ అనంతరం చైతూ కన్నా సామ్ నే నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ పుకార్లపై చైతన్య సైలెన్స్ గా ఉన్నా .. సామ్ మాత్రంతనప్పు ఏమీ లేదని చైతూపై ఉన్న కోపాన్ని పలు ఇంటర్వ్యూల్లో చెప్పే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే అయితే డివోర్స్ అనంతరం సామ్- చై ఇప్పటివరకు ఒకరినిఒకరు కలిసింది లేదు, ఎదురుపడింది లేదు. ఎవరి లైఫ్ లో, కెరీర్ లో వారు బిజీ అయిపోయారు.

అయితే ఇప్పటికీ చాలా మంది అభిమానులు వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండు అని ఆశపడుతుంటారు. అయితే రియల్ గా కలిసే అవకాశం లేకపోయినా వీరిద్దరూ ఓకే వేదికపై కనిపించి వారి ఫ్యాన్స్ ను ఖుష్ చేశారు. తాజాగా సమంత, నాగచైతన్య ఒక ఈవెంట్ లో కామన్ గా ఉన్న వేదికను పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

ముంబైలో అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్స్ ప్రాజెక్ట్స్ లో భాగమైన హీరో హీరోయిన్లు, టెక్నీషియన్లు, ఈ మెగా ఈవెంట్ కు హాజరయ్యారు. బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఈ మెగా ఈవెంట్ ను హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్ కు సౌత్ చార్మింగ్ బ్యూటీ సమంత(Samantha),అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya)ఇద్దరూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.

ఇద్దరూ ఒకే ఈవెంట్ కు వచ్చినా వారిద్దరూ మాత్రం ఒకేసారి పక్కపక్కని కనిపించలేదు. వేదికపైకి వేర్వేరు సందర్భాల్లో కనిపించారు. సమంత తమ సీటీడెల్ (Citadel) వెబ్ సిరీస్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి స్టేజ్ మీద సందడి చేసింది. ఇక చై తన టీమ్ తో కనిపించి అలరించాడు.

అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోతో సామ్, చైలు చేతులు కలిపారు. ఈ సందర్భంగా నాగ చైతన్య ( Nagachaitanya) ఈ వేదికపైకి వచ్చి ‘ధూత’(Dhootha)సక్సెస్ పై మాట్లాడాడు..” దూతలో నా క్యారెక్టర్ చాలా మంచిది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. ఆ వెబ్ సిరీస్ విజయవంతమైనందుకు చాలా హ్యాపీగా ఉంది”అని చై తెలిపాడు.

ఆ తర్వాత సామంత (Samantha) ‘సిటాడెల్’(Citadel)గురించి మాట్లాడింది. నాగ చైతన్య నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ ప్రైమ్ లో రిలీజై మంచి హిట్ సాధించింది. అదేవిధంగా సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’(Familyman) కూడా ఇందులోనే స్ట్రీమ్ అయ్యింది. లేటెస్టుగా సమంత నటించిందిన రాజ్ అండ్ డీకేలు (Rak&DK) డైరెక్ట్ చేసిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా ‘అమెజాన్ ప్రైమ్ ’ లోనే స్ట్రీమింగ్ కాబోతోంది.

ప్రస్తుతం సామ్ సీటాడెల్ పైనే ఆశలు పెట్టుకుంది. మయోసైటిస్ (Maositis) ట్రీట్మెంట్ కోసం ఏడాది కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇది హిట్ కొడితే మళ్లీ ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తోంది. మరి సామ్ లక్ ఎలో ఉందో చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Leave a Comment