Samantha Ayurvedic Treatment : భూటాన్ బాత్ టబ్ లో సమంత ఆయుర్వేదం తో మాయోసైటిస్ ను సామ్ జయిస్తుందా..
సమంత రుతు ప్రభు..ఈ అమ్మడు ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉంటున్నా, సోషల్ మీడియాకు మాత్రం దగ్గరగానే ఉంటోంది. సినిమాలు చేయకపోయినా యాడ్స్ మాత్రం చేస్తోంది.
అయితే ఈ చెన్నై చిన్నది సినిమాలకు ఎందుకు దూరమైందో క్లియర్ గా చెప్పనక్కర్లేదు అనుకుంట, ఎందుకంటే ఆమె మాయోసైటిస్ తో బాధ పడుతోంది. ఈ వ్యాధిని భరిస్తూ సినిమాలు చేయడమంటే మామూలు విషయం కాదు.
అందుకే చేతిలో ఉన్న సినిమాలు, వెబ్ సీరిస్ లు మొత్తం పూర్తి చేసేసింది. ఈ మయోసిటిస్ నుండి బయటపడేందుకు ఎన్నో ఆసుపత్రులు తిరిగింది, కానీ ఎక్కడ కూడా ఆమెకు ఈ వ్యాధి నుండి సంపూర్ణంగా బయటపడే మార్గం కనిపించలేదు.
అందుకే ఆవిడ ఇంగ్లిష్ మందులు హాస్పిటల్ ట్రీట్మెంట్ ను పక్కన పెట్టి, ఆయుర్వేద చికిత్సను ఎంచుకున్నారు. అయితే ఆ చికిత్స కాస్త భిన్నమైంది.
అది కూడా భూటాన్ లో ఈ చికిత్స తీసుకంటోంది. ఈ ట్రీట్మెంట్ గురించి సమంత మాట్లాడుతూ, ఆ వైద్యాన్ని డాట్ షో అంటరాని చెప్పింది. టిబెట్‌లో ఈ హాట్ స్టోన్ బాత్ బాగా ఫెమస్ అని అంటోంది సామ్.
ఈ హాట్ టబ్‌లో ఆ స్టోన్స్ కరిగి వాటిలో ఉన్న శక్తిని వదిలేస్తాయట, అది కేవలం ఈ హాట్ టబ్‌లోనే జరుగుతుంది కాబట్టి దీనిని డాట్ షో అని పిలుస్తారట.
ఇందులో వాడే మూలికలను కెంపా అని పిలుస్తారని, ఈ బాత్ టబ్బులోనే ఆ ఆకుల్ని కూడా వేసి ఐదారు గంటలపాటు వేడి చేస్తే ఆ మూలికల్లోని శక్తిని నీటిలోకి విడుదల చేస్తాయి. వాటి వల్ల శరీర నొప్పులు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు అలసటను తొలగిస్తుందని చెబుతోంది.
సమంత తన మాయోసైటిస్ కి ట్రీట్మెంట్ మాత్రం చేయించుకుని వదిలేయడం లేదు, ఆ ట్రీట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటోంది.
దాదాపు వెయ్యేళ్ళ క్రితం భారతదేశం, భూటాన్ మధ్య సత్సంబంధాలు ఉండేవట. ఇరు దేశాల మధ్య రాకపోకలు మాత్రమే కాక, ఆచార సంబంధాల మార్పిడి కూడా జరిగేదని చెప్పింది.
ఈ క్రమంలోనే వారు జ్ఞానాన్ని కూడా పంచుకునే వారట. అలా ఆయుర్వేదం గురించి భారత్ – భూటాన్ దేశాలు ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలు కూడా పంచుకున్నట్టు తనకు తెలిసింది అంటోంది.
టిబెట్‌లో బాగా ఫెమస్ అయినా హాట్ స్టోన్ బాత్ ను వారు మన భారతదేశ ఆయుర్వేదం నుండే కనుగొన్నట్టు తెలిపింది.
ప్రస్తుతం సమంత పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఆమెకు ఆయుర్వేదంతో అయినా సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
మునుపటి కన్నా మరింత యాక్టీవ్ గా మారాలని, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మంచి మంచి కథలతో అలరించాలని ఆశిస్తున్నారూ