Samantha Ruth Prabhu: వామ్మో.. సమంత ఏంటి ఇలా అయిపోయింది..?

WhatsApp Image 2024 03 09 at 4.44.28 PM Samantha Ruth Prabhu: వామ్మో.. సమంత ఏంటి ఇలా అయిపోయింది..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)పని అయిపోయిందా? అందుకే ఆమెకు అవకాశాలు రావడం లేదా..లేక ఆమె చేయడం లేదా? ఖుషీ (Kushi) తర్వాత ఆఫర్స్ రాకపోవడానికి కారణాలేంటి? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే పెద్ద టాక్ అయ్యింది. ఇక లేటెస్టుగా సమంత లుక్ చూసి చాలామంది సమంత పనైపోయిందని అనుకుంటున్నారు.

ఫెమినా మాగజిన్ (Femina Magazine)కోసం సమంత చేసిన ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. ఆమె ముఖంలో గ్లో పూర్తిగా మిస్ అయ్యిందని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. సమంత్ లేటెస్ట్ ఫ్యాషన్ సెన్స్ ను ఫాలో అయ్యి ఎంత ఆల్ట్రా మోడ్రన్ గా తయారైనా.. గ్లామరస్ అవుట్ ఫిట్ వేసుకున్నా..ఆమె ముఖంలో మాత్రం ఎక్కడా కూడా గ్రేస్ కనిపించడం లేదు.దీంతో ఈ పిక్స్ పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

సమంత (Samantha)హెల్త్ ఇష్యూ గురించి అందరికీ తెలుసు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు సమంత చాలా సమయం తీసుకుంది. సుమారు ఏడాది కాలంగా ఆమె అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటోంది. అందుకోసం సినిమాలకు కూడా విరామం ప్రకటించింది. ఈ మధ్యనే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే పూర్తిగా కోలుకోకుండానే సమంత మళ్లీ కెరీర్ స్టార్డ్ చేసింది. అయితే సమంత ఈ పని తెలిసి చేసిందా లేక ఇలా చేస్తే త్వరగా సెట్ అవుతానని చేసిందా ఎవరికీ అర్థం కావడం లేదు. తను మెంటల్లీ సిద్ధంగా ఉంది కాబట్టి..ఫిజికల్ గానూ సెట్ అవుతాను అనుకుని ఇలా చేసిఉంటుందని మరికొందరు అంటున్నారు. కానీ సమంత లేటెస్టుగా చేసిన ఫోటో షూట్ స్టిల్స్ మాత్రం పెద్ద ఆకర్షణీయంగా లేవమని నెటిజన్స్ అంటున్నారు.

ఫ్యాన్స్ పీలింగ్ కూడా ఇదే. ఏదేమైనా..ఒక్కసారి లైఫ్ డిస్ట్రబ్ అయితే ఇలాగే ఉంటుంది. అందులోనూ సమంతకు మయోసైటిస్ (myositis)పెద్ద మైనస్ గా నిలిచింది. ఫిజికల్ గా ఆమె హెల్త్ ఇష్యూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆమె ఫేస్ లో ఒకప్పుడు ఉన్న గ్రేస్ లేకుండా పోయింది. మరి ఇలాగే ఉంటే సామ్ కు మళ్లీ సినిమాల్లో అవాకాశాలు వస్తాయా అనేది పెద్ద డౌట్ అంటున్నారు నెటిజన్స్ .

ఏం మాయ చేసావే (Em Maya chesave) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత(Samantha). ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అమ్మడికి ఇండస్ట్రీలో భారీగా క్రేజ్ పెరిగింది. అందులోనూ ఫస్ట్ మూవీతోనే ఆమె అందం అందరిని బాగా ఆకట్టుకుంది. ఆమె లుక్స్, ఫేస్ అందరిని మెస్మరైజ్ చేశాయి. ఈ సినిమా తర్వాత వరుసగా క్రేజీ ఆఫర్లను అందుకుంది సామ్. తెలుగులోనే కాదు తమిళంలోనూ స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా సెట్ అయ్యింది.

WhatsApp Image 2024 03 09 at 4.44.12 PM Samantha Ruth Prabhu: వామ్మో.. సమంత ఏంటి ఇలా అయిపోయింది..?

ఆ తర్వాత నాగ చైతన్య (Nagachaitanya)ను పెళ్లి చేసుకుంది. అనంతరం పర్సనల్ కారణాలతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సామ్ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత మయోసైటీస్ (myositis) అటాక్ కావడంతో బాగా కుంగిపోయింది. దీంతో అప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది. మళ్లీ కెరీస్ స్టార్ చేసిన సామ్ ప్రస్తుతం సీటీడెల్(Citadel) వెబ్ సిరీస్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో ఈ ఒక్క ఆఫర్ మాత్రమే ఉంది.

Leave a Comment