Samantha Manasuku Fida: సమంత మనసుకు ఫిదా..అనాధ పిల్లల కోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌.

Samantha Manasuku Fida..Hi Nanna special screening for orphans.

Samantha Manasuku Fida: సమంత మనసుకు ఫిదా..అనాధ పిల్లల కోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌.

న్యాచురల్ స్టార్ నాని నటించిన మూవీ హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‎తో వచ్చిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్‌ రూపొందించాడు. ఈ మూవీలో నాని కూతురుగా బేబి కియారా నటించింది.

బాలీవుడ్ బ్యూటీ సీతారామం నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేసింది. ఇక అతిథి పాత్రలో కోలీవుడ్ నటి శృతిహాసన్‌ మెరిసింది.

డిసెంబర్ 7న బిగ్ స్క్రీన్స్‎లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్‎గా సాగుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు.

ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌‎కు బాగా కనెక్ట్‌ అవుతోంది.

నాని సహజసిద్ధమైన నటన ఈ సినిమాలో అందరిని ఓ లోకంలోకి తీసుకెళ్తుంది. ఫీల్ గుడ్ సినిమాగా ప్రేక్షకులను మెప్పిస్తుంది హాయ్ నాన్న. ఒక తండ్రి కూతురి మధ్య ఉన్న రిలేషన్‎ను కొత్త డైరెక్టర్ అయినా చాలా చక్కనా చూపించాడు శౌర్యువ్.

నాన్న కూతుళ్ల సెంటిమెంట్ తో సినిమాలు కొత్తేమి కాదు. కానీ ఈ మూవీని తనదైన స్టైల్‏లో చూపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాడు యంగ్ డైరెక్టర్ .

ఈ సినిమాకు సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇంప్రెస్ అవుతున్నారు. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ సినిమా బాగా నచ్చేసింది. అందుకే ఈ మూవీని మిస్ కాకూడదని ప్రత్యూష సపోర్ట్ ఆర్గ్ ఫౌండేషన్ చిన్నారుల కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్ లో పిల్లలతో కలిసి హాయ్‌ నాన్న సినిమాను చూసి ఎంజాయ్ చేసింది సమంత . ఈ ఒక్కపనితో సమంత అందరి మనసులను దోచేసి ఇన్స్పిరేషన్‎గా నిలిచింది. ఆమె చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారు.

Add a heading 2023 12 11T115843.808 Samantha Manasuku Fida: సమంత మనసుకు ఫిదా..అనాధ పిల్లల కోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌.

అంతేకాదు తన కోస్టార్, ఫ్రెండ్ నానితో తనకున్న బాండింగ్‎ను మరోసారి తెలిసేలాచేసింది సమంత. సామ్ చేసిన ఈ పనితో చిన్నారుల కన్నుల్లో వెయ్యి వోల్టుల బల్బుల్లా వెలిగిపోయాయి.

వారి ముఖాలు చిరునవ్వుతో వెలిగిపోయాయి. అనాధ చిన్నారుల పట్ల సామ్‌ చూపిస్తున్న ఔదార్యానికి అందరూ సెల్యూట్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సుదీర్ఘకాలంగా ఆమెను వేధిస్తున్న ఆరోగ్య సమస్యైన మయోసైటిస్ కు విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది.

సినిమాలకు దూరంగా ఉంటున్నా పలు షోలలో వ్యాఖ్యాతగా చేస్తూనే , అప్పుడప్పుడు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే చిన్నారులతో కలిసి సామ్ సినిమా చూసింది. ఈ ఆనందం వర్ణించలేనిదని ఎమోషనల్ అయ్యింది సామ్.

ఇదిలా ఉంటే సామ్ ఇప్పుడు తాజాగా తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తెరముందు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి హీరోయిన్ గా వెలుగువెలిగిన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రొడ్యూజర్ గా మారుతున్నట్లు అనౌన్స్ చేసింది.

సోషల్ మీడియాలో ఈ విషయాన్ని స్వయంగా పంచుకుంది సమంత. ‘ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ ” అనే ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమాలు తీయబోతున్నట్లు తెలిపింది.

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు అర్థవంతమైన , విశ్వజనీనమైన స్టోరీలను తన బ్యానర్‎లో నిర్మించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సామ్ చేతిలో ఉన్న సీటీడెల్ ఇండియన్ వర్షన్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది.

Leave a Comment