ఏమాయ చేశావే (Em Maya Chesave)అంటూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu). ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya)తో జోడీ కట్టి జెస్సీ క్యారెక్టర్ తో యూత్ ను మెస్మరైజ్ చేసింది. దీంతో అమ్మడి క్రేజ్ ఓ రేంజ్ లా పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ ఆమె అందానికి , యాక్టింగ్ కు ఫిదా అయ్యింది. ఈ మూవీ తర్వాత సమంత వరుసపెట్టి స్టార్ హీరో సినిమాల్లో నటించింది. ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా ఎదిగింది. ఇక సమంత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏళ్లు అవుతోంది.
ఇక ప్రస్తుతం సమంత అనగానే అందరికీ రెండు విషయాలు వెంటనే గుర్తుకొస్తాయి. ఒక మాజీ భర్త నాగచైతన్యతో డివోర్స్ కాగా మరొకటి మయోసైటిస్ వ్యాధి. ఈ మధ్యనే ఈ అమ్మడు ఏడాది పాటు విరామం తీసుకుని మయోసైటిస్ (Maositis)కు ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ఈ మధ్యనే మళ్లీ ఈ భామ మళ్లీ తన పనులను మొదలుపెట్టింది. హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా సమంతకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన మాజీ ప్రియుడితో జోడీ కట్టబోతోందన్న న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సిద్ధార్థ్‌తో సమంత మూవీ :
ఏడాది బ్రేక్ తర్వాత సమంత(Samantha) మళ్లీ తన వర్క్ స్టార్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే కొత్త కథలను వింటూ బిజీ అవుతోంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే సామ్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో ఓ సినిమా చేస్తున్నట్లు తాజాగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హీరో నాగచైతన్య (Nagachaitanya)తో పెళ్లికి ముందు సామ్ హీరో సిద్దార్థ్ (Siddarth)ను ప్రేమించింది. చాలా వరకు సందర్భాల్లో ఈ ఇద్దరూ ఎప్పుడూ సన్నిహితంగా ఉండేవారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ దూరమయ్యారు.
సిద్ధార్థ్‌తో సామ్ బ్రేకప్ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సమంత వివాహం తర్వాత సిద్ధార్థ్ కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక సామ్ చై తో డివోర్స్ తీసుకుని తన మూవీ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టింది. వరుసపెట్టి అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఇక చాలా రోజుల సామ్ తన మాజీ ప్రియుడితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందన్న వార్త వైరల్ అయ్యింది. అయితే దీనిపై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన రాలేదు.
సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ :
రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ సమంత (Samantha)గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మిస్ బ్యూటిఫుల్ ఎవరని యాంకర్ అడగ్గా వెంటనే సిద్ధార్థ్ (Siddarth) సమంత పేరు చెప్పి అందరూ షాక్ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత మిస్ పర్ఫెక్ట్ ఎవరని అడిగితే సమంత అనే సమాధానం చెప్పాడు. దీంతో సమంతను సిద్దార్థ ఇంకా మర్చిపోలేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రేమపక్షులు మళ్లీ కలవబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజం ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
డివోర్స్ తర్వాత సమంత మయోసైటిస్ (Maositis)తో బాధపడుతున్నప్పుడు సిద్దూ కనీసం స్పందించలేదే. అయితే ఇప్పుడు మాత్రం వింతగా ఆమె పేరును జపం చేయడం పట్ల నెట్టింట్లో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంతకు సిద్ధార్థ్ మళ్లీ దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నాడా? లేదా ఇది సినిమా స్టంటా అని కొందరు అంటున్నారు.