Samantha: ఇకపై అలాంటివి చేయను.. సమంత షాకింగ్ కామెంట్స్

website 6tvnews template 2024 03 16T114630.347 Samantha: ఇకపై అలాంటివి చేయను.. సమంత షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu ) . తన అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ), సామ్ కాంబినేషన్ లో వచ్చిన ఖుషి (Kushi ) మూవీ తర్వాత పూర్తిగా తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది ఈ బ్యూటీ . మయోసైటిస్(Maositis ) నుంచి బయటపడేందుకు కొన్ని నెలలపాటు అమెరికాలో ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తన హెల్త్ , ట్రీట్మెంట్ గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో చర్చిస్తుంది సామ్. కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకున్న ఆమె..ఇప్పుడిప్పుడే తిరిగి కెరీర్ పై దృష్టి పెడుతోంది .

సినిమా ప్రోగ్రామ్ లు , రియాల్టీ షోలలో కనిపిస్తు సందడి చేస్తుంది. ఈమధ్యనే నిర్మాతగానూ మారింది. తన సొంత బ్యానర్ లో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంది. అలాగే పాడ్ కాస్ట్ ద్వారా వైద్య నిపుణులతో కలిసి హెల్త్ టిప్స్ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఇండియా టూడే నిర్వహించిన కాన్ క్లేవ్ 2024లో ఫస్ట్ టైమ్ పాల్గొని తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

ఆ సమయంలో అసౌకర్యంగా ఫీలయ్యా :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun )హీరిగా వచ్చిన మాస్ మూవీ పుష్ప (Pushpa). ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో దుమ్ముదులిపేసింది. భారీ వసూళ్లను రాబట్టింది. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఈ మూవీలో సమంత (Samantha ) చేసిన ఊ అంటావా పాట అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ పాట ఎంతో చాలెంజ్ తో కూడుకున్నదని తాజాగా సమంత తెలిపింది. ఎంతో “ఊ అంటావా… పాట చేయాలనే డెసిషన్ కూడా ది ఫ్యామిలీ మ్యాన్ 2 (The Family Man 2)సిరీస్ లోని రాజీ క్యారెక్టర్ లాంటిదే అని భావిస్తున్నా. ఆ టైమ్ లో మన చుట్టూ ఎవరూ లేకపోవడం.. మనకు అనవసర ఒపీనియన్స్ చెప్పకపోవడమే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పు చేయడం.. వాటి నుంచి నా బలాన్ని తెలుసుకున్నాను. నాకు ఎంత ధైర్యం ఉందో తెలుసుకోవడానికకే ఊ అంటావా సాంగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో అసౌకర్యంగా ఫీలయ్యాను. నాకు నాపైన నమ్మకం లేదు. ఎందుకంటే నేను అందంగా లేనని, సరిగ్గా కనిపించనని ఇతర అమ్మాయిల లాగే అనుకునేదాన్ని . అప్పుడు నా శరీరంతో నేను చాలా అసౌకర్యంగా ఉండిపోతాను.

చాలా కష్టాలను చూశాను :

“ఊ అంటావా సాంగ్ షూటింగ్ లో ఫస్ట్ షాట్ చూసి భయపడ్డాను. వణిపోయాను. గ్లామర్ విషయంలో కాదు.. ఈ లెవెల్ కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను . ఇప్పటికీ వాటిని అధిగమించడానికి యుద్ధం చేస్తున్నాను . ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తున్నాననో నాకు తెలియడం లేదు. ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో సిటాడెల్ సిరీస్ షూట్ చేసాం. అప్పుడు చాలా కష్టాలను చూశాను. కానీ ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపై పుష్ప లో చేసిన సాంగ్స్ మళ్ళీ చేయను”. అని సామ్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Leave a Comment