Same-Gender marriage: స్వలింగ వివాహాలకు (Same gender marriage) చట్టబద్దత లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం (Suprime Court) చెబుతున్నప్పటికీ స్వలింగ వివాహాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా ఇటువంటి వివాహం ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) లోని డియోరియా లో (Deoria) వెలుగు చూసింది. ఇద్దరు మహిళలు హిందూ సాంప్రదాయం తో ఒక్కటయ్యారు.
వారిలో ఒకరు వధువుగా మరొకరు వరుడుగా వేషధారణలో ఉన్నారు. బెంగాల్ (Bengal) కి చెందిన ఈ ఇద్దరు మహిళలు డియోరియా లో ఆర్కెస్ట్రా లో పనిచేస్తున్నారు.
అయితే వీరిరువురూ గడిచిన రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిలో ఒక మహిళా పేరు జయశ్రీ కాగా ఆమె వయసు 28 సంవత్సరాలు, మరో మహిళా పేరు రాఖీ దాస్, ఆమె వయసు 23 సంవత్సరాలు అని తెలుస్తోంది.
ఆర్కెస్ట్రా బృందం లో పని చేస్తున్న సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని అంటున్నారు. కాబట్టి వారు పెళ్లితో ఒక్కటవ్వాలని భావించి వివాహం చేసుకున్నారట.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడమే కాదు, వీరి వివాహాన్ని వీరు నోటరీ కూడా చేయించుకున్నారు.
పెద్దల సమక్షంలో జరిగిన స్వలింగ వివాహాలు కూడా ఉన్నాయి : There are also same-sex marriages in the presence of Parents
స్వలింగ వివాహం చట్ట సమ్మతమా కాదా అన్నది పక్కన పెడితే, ఇప్పటికే మన దేశంలో ఇటువంటి వివాహాలు అనేకం జరిగాయి.
ఇద్దరు మగవారు, ఇద్దరు ఆడవారు పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. అయితే మొదట్లో ముంబై (Mumbai)
ఢిల్లీ (Delhi) వంటి పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం ఐన ఈ స్వలింగ వివాహాలు నెమ్మదిగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లోని డియోరియా వంటి చిన్న తరహా పట్టణాలవరకు పాకాయంటే ఇవి భవిష్యత్తులో పల్లెటూళ్లకి కూడా పాకే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే చట్టసమ్మతం కాకపోయినప్పటికీ వీటిని వ్యతిరేకించడానికి గాని, నిలువరించడానికి గాని లేకపోయింది.
ఈ స్వలింగ వివాహాలు చేసుకునే వారిలో కొందరు కుటుంబ సభ్యులను ఇష్టాలకు భిన్నంగా, వారి అనుమతి లేకుండా, వారి నుండి దూరంగా వచ్చి వివాహం చేసుకుంటుంటే,
కొందరు పెద్దలను ఒప్పించి, ఇరు కుటుంబాల సమక్షంలోనే వైభవంగా ఈ స్వలింగ వివాహాలను చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.