Samsung Galaxy S24 in 2024: 2024 లో రాబోతున్నశాంసంగ్ గెలాక్సీ S24 సీరీస్.
2024 లోకి అడుగు పెట్టడానికి పెద్దగా సమయం లేదు, అయితే కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న సమయంలో చాల మంది టెక్ ప్రేమికులు ఏ కొత్త మొబైల్స్ మార్కెట్ లోకి వస్తున్నాయో అనే విషయం పై ఒక కన్నేసి ఉంచుతారు.
అలంటి వారికి ఈ న్యూస్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. 2024 కొత్త ఏడాది లో టెక్ దిగ్గజం శాంసంగ్(Samsung) ఒక కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకొస్తోంది.
అదే శాంసంగ్ గాలక్సీ ఎస్ 24. ఈ కొత్త మోడల్ మొబైల్ ను కొత్త ఏడాది జనవరి రెండు లేదా మూడవ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనవరి 17 వ తేదీన ఈ శాంసంగ్ గాలక్సీ ఎస్ 24 ను అన్ ప్యాక్ చేసే వీలుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ విషయం బయటకి పొక్కడంతో దీనిపై మరింత హైప్ క్రియేట్ అయింది. కొత్త ఏడాదిలో మార్కెట్ లోకి రాబోతున్న ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కు A 1 పవర్డ్ ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.
ప్రీమియర్ ధరలు ఎప్పుడూ ఎక్కువే : Premier Prices Are Always High:
ఇప్పటివరకు శాంసంగ్ ప్రీమియం ఫోన్లు మార్కెట్ లోకి వచ్చినప్పుడు వాటి ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా రాబోతున్న మోడల్ కి సంబంధించి ఫీచర్లు బయటకు పొక్కడంతో ఈ ప్రీమియం ఫోన్(Premium Phones)
కి సంబంధించిన ధర ను కూడా అంచనా వేయగలమేమో అనిపిస్తుంది. శాంసంగ్ గాలక్సీ లో రాబోతున్న శాంసంగ్ గాలక్సీ s24, శాంసంగ్ గాలక్సీ s24 +, శాంసంగ్ గాలక్సీ s24 అల్ట్రా వంటి మూడు ఫోన్లు మార్కెట్ లోకి వటున్నాయనే మాట దాదాపుగా ఖాయమైపోయినట్టు వినికిడి.
Samsung Galaxy S 24 Series Storage : శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ స్టోరేజి
ఇప్పుడు రాబోతున్న శాంసంగ్ గాలక్సీ s24 బేస్ వేరియంట్ లో 8 జిబి ర్యామ్ 128 జిబి అలాగే 8జిబి ర్యామ్ 256 జిబి స్టోరేజ్ తో మార్కెట్ లోకి దిగబోతున్నాయి అని తెలుస్తోంది.
ఇక శాంసంగ్ గాలక్సీ s 24+ విషయానికి వస్తే 12 జిబి ర్యామ్256 జిబి స్టోరేజ్, అలాగే 12 జిబి ర్యామ్ 512 జిబి స్టోరేజ్ అలానే, 12 జిబి ర్యామ్ 1Tera Bite స్టోరేజ్ అప్షన్లతో వస్తుందని కొందరు టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Galaxy S 23 ని బట్టి ధరలు అంచనా వేయొచ్చు : Prices
వీటి స్టోరేజీలు ర్యామ్ ల విషయం చూస్తేనే మతి పోతోంది, మరి ఇంత ప్రేమియం మొబైల్స్ ధరలు ఎలా ఉంటాయో ఒక్క సారి అంచనా వేద్దాం.
శాంసంగ్ గాలాక్సీ s 23 సీరీస్ ధరలకు శాంసంగ్ గాలాక్సీ s24 ధరలు కూడా దగ్గరగానే ఉంటాయని కొందరు విశ్వసిస్తున్నారు.
సంపన్నుల సంగతి పక్కన పెడితే ఈ ధరలు సామాన్యుల విషయంలో మాత్రం ఎక్కువే అని చెప్పాలి. గెలాక్సీ s 24 అల్ట్రా గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు.
దాని ధర సామాన్యులకు అందనంత దూరంలో ఉంటుందేమో. ఈ మాట చెప్పడం లో అతిశయోక్తి లేదు, ఎందుకంటే ఈ మధ్య విడుదలైన ప్రీమియం ఫోన్ల ధరలు అలానే ఉన్నాయి.
Samsung Galaxy S 24: శాంసంగ్ గెలాక్సీ s 24
శాంసంగ్ గెలాక్సీ s 24 : దీని డిస్ ప్లే 6.2 అంగుళాల ఉంటుంది, ఇందులో AMOLED 2x FHD సౌకర్యం ఉంది, దీని మెయిన్ కెమెరా కి 50 మెగా పిక్సెల్ ఉంటుంది, 8 కే వీడియో రికార్డింగ్ కి ఇది తోడ్పడుతుంది.
స్పేస్ జూమ్ విషయానికి వస్తే ఇది 30x వరకు ఉంటుంది. ఇందులో 4000mAH బ్యాటరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బ్యాటరీ తో కేవలం 30 నిమిషాల్లో 50 శతం ఛార్జింగ్ చేసుకోవచ్చని అంటున్నారు.
Samsung Galaxy S 24+ :
శాంసంగ్ గెలాక్సీ s 24+ : ఇందిలో డిస్ ప్లే 6.7 అంగుళాల కెమెరా ఉంటుంది. దీని డిస్ ప్లే కి AMOLED 2x QHD ఉంటుంది.
అంతే కాదు, ఇందులో 4900 mAH బ్యాటరీ ఉంటుందని బీటలుస్తోంది. ఇక కెమెరా విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ s 24 లో ఏ విధమైన కెమెరా సెటప్ ఉంటుందో ఇందులో కూడా అదే విధమైన కెమెరా సెటప్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ s 24 అల్ట్రా : Samsung Galaxy S 24 Ultra
దీని డిస్ ప్లే చుస్తే 6.8 అంగుళాలు ఉండొచ్చని, ఇందులో కూడా AMOLED 2x QHD ఉండొచ్చని అంటున్నారు. బ్యాటరీ అల్టాకి తగ్గట్టే 5000 mAH తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ మోడల్ విషయంలో శాంసంగ్ తన పోటీదారు అయిన ఆపిల్ ని అనుసరించిందేమో అని చెప్పొచ్చు. ఐ ఫోన్ 15 ప్రో టాటానియం బాడీతో రాగా శాంసంగ్ తన గెలాక్సీ s 24 అల్ట్రా ను అల్యూమినియం తో రూపొందించింది అంటున్నారు టెక్ నిపుణులు.
అల్ట్రా అంటేనే అంతకు మించి అని అర్ధం అవుతోంది. అంటే ఇందులో తప్పకుండ పవర్ ఫుల్ కెమెరా సెటప్ ఉంది ఉండొచ్చు. ఇందులో ప్రైమరీ లెన్స్ 200 మెగా పిక్సెల్ తో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 100x స్పేస్ జూమ్ తోపాటు 10x క్వాడ్ టెలిఫోటో ఉండే ఛాన్స్ ఉందట.