Tripti Dimri: సందీప్ కాల్ చేసి ఎమన్నాడంటే…యానిమల్‌ బ్యూటీ ఆసక్తికరమైన కామెంట్స్

 Sandeep called and said... Animal beauty interesting comments

Tripti Dimri: సందీప్ కాల్ చేసి ఎమన్నాడంటే…యానిమల్‌ బ్యూటీ ఆసక్తికరమైన కామెంట్స్

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చినయానిమల్‌ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ మూవీతో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ కు మంచి క్రేజ్ వచ్చింది.

రణబీర్ కపూర్‌ తో పాటు ఈ మూవీలో యాక్ట్ చేసిన చాలా మంది స్టార్స్ ఇప్పుడు పాపులర్ స్టార్స్ గా మారారు. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ లో కనిపించిన త్రిప్తి డిమ్రి పాపులారిటీ కూడా అమాంతం పెరిగిపోయింది.

డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా యానిమల్ మూవీ విడుదలైంది. ఈ మూవీలో హీరోగా రణబీర్ కపూర్‌, హీరోయిన్ గా రష్మిక మందన్న నటించింది.

ఇక సెకండ్‌ హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈ మూవీలో త్రిప్తి డిమ్రి తన హాట్‌ నెస్ తో అలరించింది. సందీప్ రెడ్డి వంగ పుణ్యమా ఈ బ్యూటీ కూడా నేషనల్‌ క్రష్‌ అయిపొయింది. ఈ భామకు వరుస ఛాన్సులు క్యూ కడుతున్నాయని సమాచారం.

ఈ సినిమాకి ముందు త్రిప్తి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సోషల్‌ మీడియాలోనూ అంతగా క్రేజ్‌ లేదు. కానీ యానిమల్ సినిమాతో అమ్మడి జాతకం మారిపోయింది.

నెట్టింట్లోనూ ఆమె క్రేజ్‌ పెరిగిపోయింది.ప్రస్తుతం తృప్తి ఇన్స్టా ఫాలోవర్స్ ను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నవంబర్‌ లాస్ట్ వీక్ వరకు ఈ బ్యూటీ కీ 6లక్షల వరకు ఫాలోయర్లు ఉన్నారు.

యానిమల్‌ రిలీజ్ తర్వాత ఆ సంఖ్య 30 లక్షల వరకు చేరుకుంది. దీనితో త్రిప్తి డిమ్రి పేరు ట్రేండింగ్ లో ఉంది. ఆమె తో పాటు యానిమల్ లో ఆమె పాత్ర గురించి ఇప్పుడు పాజిటివ్‌ చర్చ జరుగుతోంది.

యానిమల్ సినిమా హిట్ అయిన సందర్భంగా తనకు ఈ ఆఫర్ ఎలా వచ్చిందో త్రిప్తి మీడియాతో మాట్లాడుతూ..” నెట్‌ ఫ్లిక్స్ లో క్వాలా సిరీస్ ద్వారా నటిగా కెరీర్ స్టార్ట్ చేశాను.

Add a heading 2023 12 11T163845.083 Tripti Dimri: సందీప్ కాల్ చేసి ఎమన్నాడంటే…యానిమల్‌ బ్యూటీ ఆసక్తికరమైన కామెంట్స్

ఒక యాడ్‌ షూట్‌ చేస్తున్నప్పుడు డైరెక్టర్ సందీప్‌ వంగ కాల్‌ చేశారు. క్వాలా వెబ్‌ సిరీస్ లో నీ యాక్టింగ్ బాగుంది, నేను చేసే మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది నీకు సెట్ అవుతుందని భావిస్తున్నానన్నారు. నేను ఓకే చెప్పాను. అయితే సంవత్సరం వరకు సందీప్ నుంచి కాల్‌ రాలేదు.

ఇక నాకు ఛాన్స్ లేదనుకున్నాను. కానీ సందీప్ తన మాట నిలబెట్టుకున్నారు. ఒక రోజు సందీప్ నుంచి కాల్‌ వచ్చింది. యానిమల్ లో నాది నెగటివ్‌ షేడ్స్ ఉన్న క్యారెక్టరని సందీప్ చెప్పారు. ఆయన ఇచ్చిన నమ్మకంతో మూవీని చేశాను. ఆయన చెప్పినట్లుగానే నాకు మంచి క్రేజ్ లభించింది.

ఇక తృప్తికకి ఇంతలా క్రేజ్ రావడానికి ఆమె చేసిన హాట్‌ సీన్స్ అని చెప్పక తప్పదు. ఆ సీన్ గురించి ఆమె మాట్లాడిన మాటలు వైరల్‌ అయ్యాయి.

ఆ సీన్ మూవీకి అవసరం కాబట్టి ఓకే చెప్పాను. ఆ సీన్ తీసేటప్పుడు డైరెక్టర్, హీరో చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అతి తక్కువ మంది సమక్షంలోనే ఆ సీన్ షూట్ చేశాము”అని తృప్తి తెలిపింది.

Leave a Comment